telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

ఆనందయ్య ఐ డ్రాప్స్ అనుమతిపై మరో మలుపు

ఆనందయ్య ఐ డ్రాప్స్ కి అనుమతి ఇవ్వలేమని ఏపీ ప్రభుత్వం తేల్చి చెప్పింది. నిపుణుల కమిటీ నివేదిక రాకుండా అనుమతి ఇవ్వమన్న ప్రభుత్వం.. కంటికి సంబంధించిన విషయం కాబట్టి నిపుణుల ఆమోదం లేకుండా అనుమతి ఇవ్వలేమని పేర్కొంది. అత్యవసర పరిస్థితుల్లో ఉన్న పేషేంట్స్, ఇక ఐ డ్రాప్స్ మాత్రమే ఆఖరి అవకాశం ఉన్న వారికి అనుమతి ఇస్తారా అని అడిగిన హైకోర్టు…అప్పుడు అందరూ అత్యవసర పరిస్థితి అని వస్తారని పేర్కొంది ప్రభుత్వం. రోజుకి 15 నుంచి 20 మంది మాత్రమే ఐ డ్రాప్స్ అత్యవసరం అని వస్తున్నారని పేర్కొన్నారు ఆనందయ్య న్యాయవాది అశ్వని కుమార్. ఆనందయ్య మందును తాము వ్యతిరేకించడం లేదని, అలా అని నిపుణుల కమిటీ ఆమోదం లేకుండా అనుమతి ఇవ్వమని చెప్పింది ప్రభుత్వం. ఆనందయ్య మందులో ఐ డ్రాప్స్ విషయంలో తప్ప మిగతా అన్నిటికీ ప్రభుత్వం అనుమతి ఇచిందన్న కోర్టు.. 3 వారాల సమయం ఖచ్చితంగా కావాలని అంతకు ముందు నివేదిక వచ్చే అవకాశం లేదని, ఐ డ్రాప్స్ కి అనుమతి ఇవ్వటానికి ప్రభుత్వం సిద్ధంగా లేదని తెలిపింది ప్రభుత్వం. దీనిపై ఆర్డర్స్ రిజర్వ్ చేసింది హైకోర్టు

Related posts