telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

నేడు ఆరో విడత హరితహారం.. శ్రీకారం చుట్టనున్న సీఎం కేసీఆర్‌

తెలంగాణలో ఆరోవిడత హరితహారం గురువారం ప్రారంభం కాబోతున్నది. ఇందులో భాగనగా 30 కోట్ల మొక్కలు నాటేందుకు ప్రభుత్వం సంకల్పించింది. సీఎం కేసీఆర్ మెదక్‌ జిల్లా నర్సాపూర్‌లో హరితహారం కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు. అటవీ పునరుద్ధరణ పథకం కింద అర్బన్‌ ఫారెస్ట్‌ పార్కులో ఉదయం 11.30 గంటలకు మొక్కను సీఎం నాటనున్నారు. సీఎంతోపాటు మరో ఎనిమిది మంది ప్రముఖులు మొక్కలు నాటుతారు.

కరోనా నేపథ్యంలో పరిమిత సంఖ్యలోనే ప్రజాప్రతినిధులను, అధికారులను ఈ కార్యక్రమానికి అనుమతిస్తున్నారు. ఆరోవిడుత హరితహారం కార్యక్రమంలో మొత్తం 30 కోట్ల మొక్కలు నాటేందుకు అవసరమైన ఏర్పాట్లు పూర్తయ్యాయి. 34 శాఖల సమన్వయంతో రాష్ట్ర అటవీశాఖ ఈ బాధ్యతను నిర్వర్తిస్తున్నది. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో బుధవారం మంత్రులు హరీశ్‌రావు, ఇంద్రకరణ్‌రెడ్డి నర్సాపూర్‌లో ఏర్పాట్లను పర్యవేక్షించారు.

Related posts