telugu navyamedia
క్రైమ్ వార్తలు తెలంగాణ వార్తలు వార్తలు

తిర్యాని అడవుల్లో మావోల కోసం పోలీసుల కూంబింగ్..!

naksals encounter

తెలంగాణ రాష్ట్రంలోని కొమురం భీం జిల్లా తిర్యాని మండలం, గుండాల అటవీ ప్రాంతాల్లో మావోయిస్టుల కోసం పోలీసు బలగాలు కూంబింగ్ చేస్తున్నాయి. కూంబింగ్ నిర్వహిస్తున్న క్రమంలో పోలీసు బలగాలకు మావోయిస్టులు తారసపడ్డారని, మావోయిస్టు స్టేట్ కమిటీ మెంబర్ మైలవరపు అడేల్లు అలియాస్ భాస్కర్, ఏరియా కమిటీ మెంబర్ వర్గేష్‌తో పాటు మరో ముగ్గురు మావోయిస్టు సభ్యులు తృటిలో పోలీసుల దృష్టి నుంచి తప్పించుకున్నారని పోలీస్ అధికారులు తెలిపారు.

రెండు వారాల క్రితం మావోయిస్టు కొరియర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్న క్రమంలో వారి నుంచి కీలక సమాచారం రాబట్టారు. ఉమ్మడి అదిలాబాద్ జిల్లాలో రిక్రూట్‌మెంట్ చేస్తున్నట్లు పోలీసులకు కీలక సమాచారం అందిన వెంటనే అప్రమత్తమయ్యారు. అడుగడుగున గాలింపు చర్యలు చేపట్టారు. మావోయిస్టులకు సెల్టర్ జోన్‌గా ఉన్న మంతి, తిర్యాని అటవీ ప్రాంతంలో పోలీసులు పూర్తి స్థాయిలో జల్లెడ పడుతున్నారు.

Related posts