తెలంగాణ ఆర్థిక మంత్రి హరీష్ రావు మరోసారి కాంగ్రెస్, బీజేపీలపై ఫైర్ అయ్యారు. బీజేపీ అంటే భారతీయ ఝూటా పార్టీ అని హరీష్ రావు విమర్శలు చేశారు. ఇవాళ దుబ్బాక ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు హరీష్ రావు. బీజేపీ నేతలు ఉద్యోగాలపై మాట్లాడుతున్నారని..మోడీ అధికారంలోకి వస్తే ఏడాదికి కోటి ఉద్యోగాలు ఇస్తామన్నారని..ఆరేళ్లలో ఎంత మందికి కొలువులు ఇచ్చారో చెప్పాలని ప్రశ్నించారు. కాంగ్రెస్ కు ఓటేస్తే కాలిపోయే మోటర్లు..బీజేపీకి ఓటేస్తే బాయి కాడా మీటర్లు అన్నారు. ఇంటింటికి నీళ్లు ఇచ్చిన ఘనత సీఎం కెసిఆర్ దే అని పేర్కొన్నారు. కెసిఆర్ హయాంలో 24 గంటలు ఉచిత కరెంట్ ఇస్తున్నామన్నారు. పెన్షన్లపై చర్చకు బస్టాండ్ కు రమ్మన్న బండి సంజయ్ ఇప్పటి వరకు పత్తాలేడన్నారు. కాంగ్రెస్, బీజేపీలు గోబెల్స్ ప్రచారంతో ఓట్లు అడుగుతున్నారు. 7250 కోట్లు వానా కాలం పంటకు రైతు బంధు తెరాస ఇస్తే..బీజేపీ ప్రభుత్వం ఒక్క రూపాయి ఇచ్చిందా అని ప్రశ్నించారు. బీడీ కార్మికులకు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఒక్క రూపాయి ఇచ్చారా..కాంగ్రెస్ హయాంలో చెప్పులు లైన్లో పెడితే తప్ప ఎరువు బస్తా దొరికేది కాదన్నారు. దుబ్బాక ఎన్నికల్లో కారు గుర్తుకే ఓటేయాలని కోరారు.
previous post