telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

బాలీవుడ్ లో .. మహర్షి రీమేక్ .. సల్మాన్ బ్రాండ్…

maharshi remake by salman khan

బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ సౌత్ సినిమాలు రీమేక్ చేయడంలో ముందుంటాడు. ఆయన తన కెరీర్‌లో దాదాపు 10 సౌత్ మూవీ రీమేక్స్‌లో నటించాడు. ‘రెడీ’. ‘కిక్’, ‘వాంటెడ్’ ఇలా సల్మాన్ చేసిన అన్ని సినిమాలు మంచి విజయాలు అందుకున్నాయి. అయితే తాజా సమాచారం ప్రకారం సల్మాన్ ఖాన్ మరో సౌత్ సినిమాను రీమేక్ చేయనున్నట్లు తెలుస్తోంది.

గత వారం మహేష్ బాబు, వంశీ పైడిపల్లి కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘మహర్షి’ చిత్రం రిలీజై బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్స్ వర్షం కురిపిస్తోంది. ఇక ఈ సినిమాని సల్మాన్ ఖాన్‌తో రీమేక్ చేయించే పనిలో పడ్డారట దర్శక నిర్మాతలు. మొదట మూవీని సల్మాన్‌కి చూపించి ఆయన ఓకే చేస్తే రీమేక్ పనులు మొదలుపెట్టే యోచనలో ఉన్నారంట నిర్మాతలు. మరి సల్మాన్ సినిమా చూసి ఏ నిర్ణయం చెబుతాడో వేచి చూడాల్సిందే.

Related posts