telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

దాక్కొని మొరిగే కుక్కలు అంటూ ట్రోలింగ్ పై దర్శకుడి కామెంట్స్

Tarun

‘పెళ్ళి చూపులు, ఈ నగరానికి ఏమైంది’ వంటి సినిమాలతో ఆకట్టుకున్న దర్శకుడు తరుణ్‌ భాస్కర్‌. ‘మీకు మాత్రమే చెప్తా’ సినిమాతో యాక్టర్‌ కూడా అయ్యాడు. మలయాళ చిత్రం `కప్పెళ`ను పొగుడుతూ ఈ మధ్య తరుణ్ భాస్కర్ చేసిన పోస్ట్ ఒకటి వివాదానికి దారితీసింది. `”అరవడం.. స్మార్ట్ గా డైలాగ్ చెప్పడం.. స్లో మోషన్ ఫైట్లు.. క్లైమాక్స్ లో మెసేజ్ లు ఇచ్చే హీరోలు ఉండరు. చివరి 10 నిమిషాల్లో రైతుల గురించో.. సైనికుల గురించో.. ఇండియా గురించో సందేశాలు ఉండవు. కానీ దీన్ని కూడా ఆ ఊరిలో సినిమా అంటారు మరి” అంటూ తరుణ్ పోస్ట్ పెట్టారు. అయితే దీనికి హీరోల ఫ్యాన్ గ్రూపుల్లో ట్రోలింగ్స్ ఎదురయ్యాయి. మన హీరోలను తక్కువ చేసి తరుణ్ భాస్కర్ వ్యాఖ్యలు చేశాడంటూ మండిపడుతున్నారు. అయితే ట్రోల్ చేసే వారిపై కూడా తరుణ్ భాస్కర్ తనదైన స్టైల్ లో కామెంట్ చేసాడు. నకిలీ ఐడి లతో దాక్కొని మొరిగే కుక్కలు అంటూ.. ఆత్మాభిమానం లేదా? అంటూ ఫైర్ అయ్యాడు.

Related posts