telugu navyamedia
సినిమా వార్తలు

ఆర్ఆర్ఆర్ : షూటింగ్ లో ఎన్టీఆర్ కు గాయం

RRR

దర్శకధీరుడు రాజమౌళి, ఎన్టీఆర్, రామ్ చరణ్ లు హీరోలుగా తెరకెక్కిస్తున్న భారీ మల్టీస్టారర్‌ ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ టీమ్ కు మరో షాక్ తగిలింది. ఇటీవల పూణే షూటింగ్ లో రామ్‌ చరణ్‌ గాయపడగా, షూటింగ్‌ మూడు వారాల పాటు వాయిదా పడ్డ విషయం తెలిసిందే. తాజాగా షూటింగ్ హైదరాబాద్‌ లో ప్రారంభం కాగా ఎన్టీఆర్‌ కూడా గాయపడ్డాడు. ఆయన కుడి చేతికి గాయం అయినట్టు సోషల్ మీడియాలో ఫోటోలు వైరల్‌ అవుతున్నాయి. అయితే ఈ గాయం మరీ పెద్దదేమీ కాదని, చేతికి కట్టుతోనే ఎన్టీఆర్ షూటింగ్ కు వస్తున్నట్టు చిత్ర యూనిట్ వెల్లడించింది. రామ్‌ చరణ్‌ సరసన బాలీవుడ్ హీరోయిన్ అలియా భట్ నటిస్తుండగా ఎన్టీఆర్‌ కు జోడీగా ఇంకా ఎవరినీ తీసుకోలేదు. తొలుత బాలీవుడ్ నటి డైసీని ప్రకటించినప్పటికీ, ఆపై ఆమె ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకుంది. ఈ నేపథ్యంలోనే జాక్విలిన్ ఫెర్నాండజ్ పేరు తెరపైకి వచ్చింది. ఆమెను సల్మాన్ ఖాన్ సిఫార్స్ చేసినట్టుగా ఒక వార్త షికారు చేస్తోంది. అయితే హీరోయిన్ పాత్రకా? లేదంటే మరేదైన ప్రత్యేక పాత్రకా? అనేది తెలియాల్సి వుంది. ఈ సినిమాలో అజయ్ దేవగణ్, సముద్రఖని కీలకమైన పాత్రల్లో కనిపించనున్నారు.

Related posts