telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

సాహో … ట్రైలర్ కు అంతా సిద్ధం… రేపే ముహూర్తం..

Sahoo

ప్రభాస్ కథానాయకుడిగా, సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ చిత్రం ‘సాహో’. శ్రద్ధా కపూర్ కథానాయకగా నటించిన ఈ సినిమా ఈ నెల 30న మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో ఈ చిత్ర యూనిట్ ప్రమోషన్ల వేగాన్ని బడ్జెట్ లాగా భారీగా పెంచింది. ఈ నేపథ్యంలోనే ఇప్పటి వరకు కొన్ని పోస్టర్లు, మేకింగ్ వీడియోలు విడుదల చేస్తూ, అభిమానులలో ఆసక్తిని భారీగా పెంచింది సాహో యూనిట్. తాజాగా ప్రేమోషన్ల భాగంగానే ఈ నెల 10న సాహో ట్రైలర్ విడుదల కానున్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. దీంతో అభిమానులు సాహో ట్రైలర్ కోసం ఎదురు చూస్తూ సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తున్నారు.

అభిమానులలో ఇంకాస్త ఆసక్తి పెంచేందుకు ప్రభాస్ కూడా ఫేస్‌బుక్‌లో ‘డార్లింగ్స్, సాహో ట్రైలర్ ఈ నెల 10న రానుంది. సిద్దంగా ఉండండి’ అంటూ పోస్ట్ చేసాడు. దీంతో అభిమానులు సాహూ ట్రైలర్ కోసం వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారు. సాహూ ట్రైలర్ ఎప్పుడు వస్తుంది అని. అయితే ఈ సినిమా స్వాతంత్ర్య దినోత్సవం సందర్బంగా విడుదల కావాల్సిన ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్స్ పనుల కోసం ఈ నెల 30 కి వాయిదా వేశారు. కాగా బాహుబలి చిత్రం తర్వాత ప్రభాస్ భారీ బడ్జెట్ చిత్రం సాహూ అవ్వడంతో ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు.

Related posts