telugu navyamedia
ఆరోగ్యం

కండలు పెంచండి… ఎక్కువకాలం జీవించండి

Muscles

ఎక్కువకాలం ఆరోగ్యంగా జీవించాలని చాలామంది అనుకుంటారు. కానీ వారి వారి జీవన విధానాల వల్ల, అలవాట్ల వల్ల చాలామంది 60 ఏళ్ళు కూడా నిండకుండానే మరణిస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు ఎక్కువకాలం జీవించాలంటే కండరాలు పెంచమని చెప్తున్నారు శాస్త్రవేత్తలు. వెంటనే బరువులు మోసి కండలు పెంచేయమని సూచిస్తున్నారు. ఎందుకంటే కండరాల శక్తి ఎక్కువగా ఉన్నవారు ఎక్కువ కాలం జీవిస్తారని తాజా అధ్యయనంలో వెల్లడైంది. 41-85 ఏళ్ల మధ్య వయసున్న 3,878 మందిపై బ్రెజిల్‌లోని రియోడిజినారోకు చెందిన ఎక్సర్‌సైజ్‌ మెడిసిన్‌ క్లినిక్‌ క్లినిమెక్స్‌ పరిశోధకులు అధ్యయనం చేశారు. మొదట వారి కండరాల శక్తిని లెక్కించి, తరువాత 2001 నుంచి 2006 వరకు వారితో పలు రకాల వ్యాయామాలు చేయించారు. దీంతో వారిలో మరణాల ముప్పు స్వల్పంగా తగ్గినట్లు గుర్తించారు శాస్త్రవేత్తలు. అందుకే మంచి వ్యాయామం చేస్తూ కండరాలను పెంచండి. మంచి ఆరోగ్యంతో ఎక్కువకాలం జీవించండి.

Related posts