telugu navyamedia
ఆరోగ్యం ట్రెండింగ్

మెంతులతో .. మహాగొప్ప ఆరోగ్య ప్రయోజనాలు .. !

health benefits of menti seeds

వంట ఇంటి పోపు దినుసుల్లో మెంతులు కూడా ఒక‌టి. మెంతుల‌తో కూర‌ల‌కు చ‌క్క‌ని రుచి, వాస‌న వ‌స్తాయి. మెంతుల‌ను చాలా మంది ప‌చ్చ‌ళ్ల త‌యారీలో ఉప‌యోగిస్తుంటారు. నిజానికి మెంతుల‌తో మ‌న‌కు అనేక రకాల ఆరోగ్య‌క‌ర ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. అవేమిటో తెలుసుకుందాం…!

* ఒక టీస్పూన్ మెంతి పొడిని ఒక గ్లాస్ నీటిలో క‌లుపుకుని భోజ‌నానికి ముందు తీసుకుంటే గ్యాస్‌, అసిడిటీ, జీర్ణ స‌మ‌స్య‌లు పోతాయి. మ‌ధుమేహం నియంత్ర‌ణ‌లోకి వ‌స్తుంది.

health benefits of menti seeds* మెంతుల‌ను వాడడం వ‌ల్ల మ‌హిళ‌ల‌కు రుతు స‌మ‌యంలో వ‌చ్చే స‌మ‌స్య‌ల నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది. బాలింత‌ల్లో పాలు ఎక్కువ‌గా ప‌డాలంటే మెంతుల‌ను ఉప‌యోగించాలి.

* చ‌ర్మ స‌మ‌స్య‌లు, చ‌ర్మంపై వ‌చ్చే ఇన్‌ఫెక్ష‌న్ల‌ను తగ్గించ‌డంలో మెంతులు బాగా ప‌నిచేస్తాయి. అలాగే జ్వ‌రం, గొంతు నొప్పి సమ‌స్య‌ల‌కు కూడా మెంతులు బాగా ప‌నిచేస్తాయి.

* శ‌రీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్‌ను క‌రిగించ‌డంలో, అధిక బ‌రువును త‌గ్గించ‌డంలోనూ మెంతులు బాగా ప‌నిచేస్తాయి.

Related posts