ఇటీవల పసిడి ధరలలో భారీగా మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఒకరోజు బంగారం ధర భారీగా తగ్గితే మరో రోజు బంగారం ధరలు భారీగా పెరుగుతాయి. నిన్నటి వరుకు భారీగా పెరిగిన బంగారం ధర న్యూ ఇయర్ సందర్భంగా భారీగా తగ్గింది. అయితే నిన్నటి వరుకు పెరిగిన బంగారం ధరలు ఒక్కసారిగా పడిపోవటంతో సంబరాలు చేసుకుంటున్నారు పసిడి ప్రేమికులు. హైదరాబాద్ మార్కెట్ లో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 20 రూపాయిల తగ్గుదలతో 40,670 రూపాయలకు చేరింది. పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా 30 రూపాయిల తగ్గుదలతో 37,270 రూపాయలకు చేరింది. అయితే బంగారం ధరలు పడిపోగా వెండి ధర కూడా అదే బాటలో నడిచింది. దీంతో కేజీ వెండి ధర 50 రూపాయిలు తగ్గుదలతో 49,300 రూపాయిలకు చేరింది.
అంతర్జాతీయంగా బంగారం కొనుగోలు దారుల నుంచి డిమాండ్ భారీగా తగ్గటంతో బంగారంపై ప్రతికూల ప్రభావం చూపిందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఢిల్లీలో కూడా బంగారం ధరలు భారీగా తగ్గాయి. విజయవాడలో, విశాఖపట్నంలో కూడా ఇలాగె కొనసాగుతున్నాయి. ఢిల్లీ మార్కెట్ లోను పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 38,050 రూపాయల వద్ద స్థిరంగా కొనసాగుతుంది. కాగా పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా 37,880 రూపాయల వద్ద కొనసాగుతుంది. రాబోయే రోజుల్లో బంగారం ధరలు మరింత తగ్గే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు చెప్తున్నారు.
కేసీఆర్ ఉద్యమ ద్రోహులతో మాట్లాడిస్తున్నారు: అశ్వాత్థామరెడ్డి