విశాఖపట్నం ఉక్కుకర్మాగారం ప్రైవేటీకరణ విషయంలో విశాఖపట్నం నార్త్ నియోజక వర్గం నుంచి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించిన గంటా శ్రీనివాస్ రాజీనామా చేసిన విషయం తెలిసిందే. స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం తాను తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. అయితే… తాజాాగా సీఎం జగన్‌కు మాజీ మంత్రి గంటా శ్రీనివాస రావు ట్వీట్ చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం ప్రధానికి లేఖ రాసినందుకు ట్విటర్ వేదికగా కృతజ్ఞతలు తెలిపారు గంటా. “వైజాగ్ స్టీల్స్ పునరుద్దరణ కోసం కీలకమైన సలహాలు, పరిష్కారాలతో సీఎం జగన్.. ప్రధాని మోడీకి లేఖ రాయడాన్ని ఆహ్వానిస్తున్నాం. సొంత ఇనుప ఖనిజం గనిని కేటాయించడం, రుణాలను ఈక్విటీ లుగా మార్చడం ద్వారా స్టాక్ ఎక్స్చేంజి లో నమోదై నిధుల సేకరణకు అవకాశం ఉండడం లాంటివి పరిష్కార మార్గాలు. ఇందుకు ముఖ్యమంత్రికి ధన్యవాదములు తెలియచేస్తున్నాను. అయితే కేంద్రం ఇప్పటికే పాలసీ తీసుకున్నందున లేఖతో పాటు ముఖ్యమంత్రి గారు స్వయంగా వెళ్లి ప్రధానిని కలిసి వైజాగ్ స్టీల్ ఏర్పాటు ఉద్యమాన్ని సైతం వివరించి విశాఖ, తెలుగు ప్రజల మనోభావాలను వివరించి ప్రధానిని ఒప్పించాలని విజ్ఞప్తి చేస్తున్నాను. అవసరమైతే అఖిలపక్షాన్ని కూడా తీసుకెళ్లి ఒత్తిడి తేవాలని కోరుతున్నాను. ” అంటూ గంటా శ్రీనివాస రావు ట్వీట్ చేశారు.
previous post
కూటమి పార్టీలన్నింటికి అవినీతి చరిత్ర: మోదీ