telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు

పోలీసులకు సవాలుగా మారిన గాంధీ ఆస్పత్రి ఘటన

హైదరాబాద్‌లోని గాంధీ ఆసుపత్రిలో అక్కాచెల్లెళ్లపై సామూహిక అత్యాచారం ఘటనను తెలంగాణ ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. దీనిపై విచారణకు హోంమంత్రి ఆదేశించారు. అక్కాచెల్లెళ్లలో కనిపించకుండా పోయిన మహిళ కోసం సెర్చ్‌ ఆపరేషన్ కొనసాగుతోంది. దీనిపై రోజుకో వార్త వినిపిస్తోంది. అయితే దీనిపై స్పందించిన గాంధీ సూపరిండెంట్ రాజారావు గాంధీ ఆసుపత్రిలో అత్యాచారం జరిగేందుకు అవకాశం లేదని అంటున్నారు. మొత్తం గాంధీ ఆసుపత్రిలో 209 సీసీ కెమేరాలు ఉండగా అందులో 189 పనిచేస్తున్నాయని దీంతో ఆస్పత్రి ఆవరణలో అత్యాచారం జరిగేందుకు అవకాశం లేదని అంటున్నారు. ఇది ప్రాధమిక విచారణలో కూడా తేలిందని ఆయన చెబుతున్నారు. అయినా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని అత్యాచార అరోపణలు ఎదుర్కొంటున్న ఉమామహేశ్వర్ రావును సస్పెండ్ చేశామని గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్ రాజారావు తెలిపారు. ఇప్పటికే ఈ కేసులో ఏడుగురిని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.

మరోవైపు బాధితురాలి సోదరి కోసం పోలీసులు తీవ్రంగా గాలింపు చర్యలు చేపడుతున్నారు. సూపరింటెండెంట్ రాజారావు చెప్పిన దాని ప్రకారం అన్నికెమెరాలు ఉంటే ఆమె ఎక్కడికి వెళ్లిందో చెప్పలేని పరిస్థితిలో పోలీసులు ఉన్నారు. బాధితురాలితోపాటు కనిపించకుండా పోయిన మహిళ కోసం 3 బృందాలు రంగంలోకి దిగాయి. భాదితురాలు తనపై అత్యాచారంతో పాటు మత్తు మందు ఇచ్చారని చెబుతున్నా అందుకు సంబంధించి మెడికల్ రిపోర్ట్‌లో మాత్రం బయటపడలేదని తెలుస్తోంది. బాధితురాలు చెప్తున్న విషయాల్లో పొంతన లేకపోవడంతో ఇదంతా కల్లు ప్రభావంతో జరిగిన ఘటనగా అనుమానిస్తున్నారు. ఆ కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు. అదృశ్యమైన మహిళ వద్ద సెల్‌ఫోన్‌ లేకపోవడంతో దర్యాప్తు జఠిలంగా మారింది. ఏది ఏమైనా ఈ సంఘటన పోలీసులకు సవాల్‌గా నే మారింది. ఓ వైపు హోంమంత్రి స్వయంగా ఆసుపత్రి విజిట్ చేయడంతో పాటు ఎస్సీ కమిషన్ కూడా దర్యాప్తుపై దృష్టి సారించడంతో ఈ సంఘటన హాట్ టాపిక్‌గా మారింది.

Related posts