రాజధాని అమరావతిలో అసైన్డ్ ల్యాండ్స్ అమ్మకాలు , కొనుగోళ్లలో అవకతవకలు జరిగాయంటూ సీఐడీ నమోదు చేసిన కేసులో మాజీ మంత్రి నారాయణకు హైకోర్టు మూడు నెలల ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.
ముందస్తు బెయిల్ కోసం నారాయణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై ఈరోజు హైకోర్టులో విచారణకు రాగా…. నారాయణ తరపున సీనియర్ న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు వాదనలు వినిపించారు.
నారాయణకు ఆరోగ్య పరిస్థితి బాగాలేదని, విదేశాలకు వెళ్లి చికిత్స చేయించుకోవాల్సి ఉందని ఆయనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని న్యాయవాది కోరారు.
ఈ కేసులో కింద కోర్టులో కూడా మిగతా నిందితులకు సెక్షన్‌లు వర్తించవని రిమాండ్‌ను తిరస్కరించిన అంశాన్ని న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకువచ్చారు.
అయితే ఈ కేసులో నారాయణ ప్రధాన నిందితుడని ప్రభుత్వ న్యాయవాది వాదించారు. ఎస్సీ, ఎస్టీ కేసులో బెయిల్ ఇవ్వకూడదని ఇవ్వవద్దని ఆయన కోరారు.
అయితే హైకోర్టులోనే మరో కేసులో నారాయణకు ముందస్తు బెయిల్ ఇచ్చిందని న్యాయవాది పోసాని గుర్తుచేశారు. వాదనలు విన్న హైకోర్టు… మూడు నెలల పాటు నారాయణ విదేశాల్లో చికిత్స చేయించుకునేందుకు మధ్యంతర ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
ఆదాయానిచ్చే హైదరాబాద్ ఏపీకి లేకుండా పోయింది: జగన్