telugu navyamedia
క్రైమ్ వార్తలు

గాంధీ ఆస్పత్రిలో అగ్నిప్రమాదం..

హైద‌రాబాద్‌లోని సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. షార్ట్ సర్క్యూట్‎తో నాలుగో అంతస్తులో ఒక్కసారి మంటలు చెలరేగాయి. దీంతో మూడో ఫ్లోర్‌ నుంచి మొదటి ఫ్లోర్‌ వరకు పెద్ద ఎత్తున్న మంటలు వ్యాపించాయి. పలువురు రోగులు మంటల్లో చిక్కుకున్నారు. ఆకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో భయాందోళనకు గురైన రోగులు బయటకు పరుగులు తీశారు.

వెంటనే అప్రమత్తమైన ఆసుపత్రి సిబ్బంది అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న ఫైర్‌ సిబ్బంది.. కేవలం 40 నిమిషాలలోనే మంటలను అదుపులోకి తీసుకోచ్చారు.

ప్రమాదం జరుగగానే ఆస్పత్రిలో ఉన్న రోగులు భయాందోళనకు గురయ్యారు. ఆస్పత్రిలో టెన్షన్‌ వాతావరణం నెలకొంది. అయితే మూడో ఫ్లోర్ లో ఉన్న విద్యుత్‌ ప్యానెల్‌ బోర్డు రూమ్‌లో షార్ట్‌ సర్క్యూట్‌తో మంటలు చెలరేగినట్లు సమాచారం. స్వల్పంగానే అగ్ని ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

Related posts