ఆస్ట్రేలియాలోని అడిలైడ్‌లో ఓ 76 ఏళ్ల బామ్మ కొన్ని కోళ్లను పెంచుకుంటోంది. ఎప్పట్లాగే ఆ రోజు కూడా గుడ్లకోసం కోళ్ల వద్దకు వెళ్లిందామె. ఇంతలో అక్కడికొచ్చిన ఓ కోడి పుంజు.. ఆమెపై దాడి చేసింది. ఆమె కాలిపై ముక్కుతో పొడిచింది. కాల్లోని వెరికోస్ అనే నరానికి దాని ముక్కు తగలడంతో ఆ బామ్మకు తీవ్రంగా రక్తస్రావం జరిగింది. దీంతో ఆస్పత్రిలో చేరిన ఆమె.. చికిత్స పొందుతూ మరణించింది. ఇలాంటి ఘటనలు అత్యంత అరుదుగా జరుగుతాయని పరిశోధకులంటున్నారు. ఒక్కోసారి పెద్ద పెద్ద క్రూర మృగాలేకాదు, ఎటువంటి హానీ చేయని ఇలాంటి జంతువుల వల్ల కూడా ఇలానే ప్రాణాల మీదకు వస్తుందని హెచ్చరించారు.
previous post
సమస్యలపై రాసిన లేఖలకు జగన్ నుంచి స్పందన లేదు : కన్నా