telugu navyamedia
ఆరోగ్యం

మొలకెత్తిన గింజలుతో సంపూర్ణ ఆరోగ్యం..

మొలకెత్తిన గింజలు తినడం ద్వారా సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందుతారు.. వీటిలో ఉండే విటమిన్లు ఖనిజాలు శరీరానికి అవసరమైన పోషకాలను అందిస్తాయి.. ప్రతిరోజూ గుప్పెడు మొలకెత్తిన గింజలు తినడం వలన కలిగే ప్రయోజనాలు తెలిస్తే ప్రతిరోజు కచ్చితంగా మీ డైట్ లో తీసుకుంటారు.

15 Incredible Benefits of Eating Sprouts Daily

మొలకెత్తిన గింజలను బ్రేక్ ఫాస్ట్, స్నాక్స్, లంచ్, డిన్నర్ లో ఎప్పుడైనా తీసుకోవచ్చు. ఇవి కొద్దిగా తిన్నా కడుపు నిండుతాయి.
మొల‌క‌ల‌లో పీచు ఎక్కువ స్థాయిలో ఉండడంతో ..కెల‌రీలు త‌క్కువ‌గా ఉండి బ‌రువు త‌గ్గించుకోనేందుకు ఎంతో స‌హాయ‌కారిగా ఉంటాయి. మొల‌క‌లు తిన‌డం వ‌ల‌న ఎక్కువ క్యాల‌రీల‌ను పొంద‌కుండానే పోష‌కాల‌ను పొంద‌వ‌చ్చు.

మొల‌కలు ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు :-
* మొలకెత్తిన గింజల్లో ప్రోటీన్, మాంగనీసు, మెగ్నీషియం, పాస్పరస్, ఫోలేట్ , విటమిన్ సి, విటమిన్ కె లాంటి అద్భుతమైన పోషకాలు ఉన్నాయి. అలాగే ఇందులో యాంటీఆక్సిడెంట్లు, అమైనో ఆమ్లాలు సమ్మేళనాలు సమృద్ధిగా ఉన్నాయి. ఈ గింజలు లో ఉండే ప్రోటీన్ నిల్వలు సులభంగా జీర్ణం అవుతాయి‌. దీనిలో ఫైబర్ కంటెంట్ కూడా అధికంగా ఉంటుంది. అందువలన వీటిని తింటే ఎక్కువ సేపు ఆకలి అనిపించదు.

* బరువు తగ్గాలనుకునే వారికి మొలకెత్తిన గింజలు బెస్ట్ ఫుడ్.. వీటిని ప్రతి రోజూ తింటే బరువు తగ్గడం మీరే గమనిస్తారు.. ఇందులో 7.6 శాతం మాత్రమే ఫైబర్ ఉంటుంది. మధుమేహ వ్యాధిగ్రస్తులకు కూడా ఇది మంచి ఆహారంగా సూచిస్తారు హెల్త్ నిపుణులు.. పద్దాక ఏదో ఒకటి తినాలనిపించే డయాబెటిస్ వారికి ఇది బెస్ట్ సొల్యూషన్. ఎందుకంటే దీనిలో ఉన్న ఫైబర్ ఎక్కువ సేపు ఆకలి వేయకుండా ఉంటుంది.

Can Sprouts Help with Weight Loss? | Makeupandbeauty.com

* ఇది తింటే కడుపు నిండుగా అనిపిస్తుంది. ఒక కప్పు మొలకల్లో 14 శాతం ప్రోటీన్ ఉంటుంది.. ఎక్కువగా ప్రోటీన్ ఉన్న ఆహారం తీసుకోవడం వల్ల శరీరంలో నిల్వ ఉన్న కొవ్వు పెరుగుతుంది.. ఇందులో 0.38 శాతం కొవ్వు మాత్రమే ఉంటుంది.. కొవ్వు పదార్థాలు ఎక్కువగా తీసుకోవడం కూడా ఆరోగ్యానికి మంచిది కాదు.. మొలకలు యాంటీఆక్సిడెంట్స్ అధికంగా ఉన్నాయి. యాంటీఆక్సిడెంట్స్ జుట్టు, గోర్లు పెరగడానికి, చర్మం యవ్వనంగా కనిపించడానికి దోహదపడతాయి. మొలకెత్తిన గింజలు తినడం వలన ప్రాణాంతకమైన క్యాన్సర్ వ్యాధి నిరోధించడంలో సహాయపడుతుంది.

* మొలకలు తినడం వల్ల శరీరానికి అవసరమైన పోషకాలు అందుతాయి. ఇది మన శరీరంలోని రక్తం తోపాటు ఆక్సిజన్ను శరీరంలోని అన్ని భాగాలకు ప్రసరించేలా చేస్తుంది. జీవక్రియ రేటును వృద్ధి చెందుతుంది. ఉండే విటమిన్ సి అధికంగా ఉంటుంది. రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది. శరీరంలో టాక్సిన్స్ ను తొలగించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఇందులో విటమిన్ సి అధికంగా ఉండటం వల్ల తెల్ల రక్త కణాలు వృద్ధి చెందేలా చేస్తుంది.Sprouts Health Benefits: Weight Loss and 5 Other Health Benefits of Having Sprouts Daily

* వీటిని తినడం వల్ల శరీరంలో మంచి కొలెస్ట్రాల్ పెరిగి చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. ఇందువలన గుండె సంబంధిత సమస్యలు రావు .వీటిలో ఉండే ఫైట్ఏరోజైన్ నిల్వలు గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి.. ఇందులో అధిక మొత్తంలో ఎంజైమ్లు ఉంటాయి. వాటిలో ఎంజైమ్లు ఆహారంలోని పోషకాలను శోషించేందుకు ఉపయోగపడతాయి.

Sustainable Valentine's Day Suggestions

 

* పెస‌ల‌ను క్ర‌మం త‌ప్ప‌కుండా తినేవాళ్ళు వ‌య‌సు క‌న్నా ప‌దేళ్ళు త‌క్కువ‌గా క‌నిపిస్తారు. ఇందులో అధిక కాప‌ర్ వ‌ల్ల చ‌ర్మం ముడ‌త‌లు ప‌డ‌కుండా ఉంటుంది.

Sprouts: Benefits, Easy Preparation, And Potential Risks

Related posts