telugu navyamedia
ఆంధ్ర వార్తలు

సీఎం వద్దకు నెల్లూరు వైసీపీ నేతల పంచాయతీ…

*సీఎం జ‌గ‌న్ ద‌గ్గ‌ర‌కు నెల్లూరు పంచాయితీ
*సీఎం జ‌గ‌న్‌తో కాకాని, అనిల్ భేటి
*కొద్ది రోజులుగా నెల్లూరులో వివాదాలు నేప‌థ్యంలో
ఇరువురితో మాట్లాడిన సీఎం జ‌గ‌న్‌

ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ తర్వాత నెల్లూరు జిల్లా రాజకీయాలు వేడెక్కాయి. జిల్లాకు చెందిన కొత్త మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి , మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మధ్య వర్గపోరు తారాస్థాయికి చేరింది.

నెల్లూరు జిల్లా నుండి మంత్రివర్గంలోకి కాకాణి గోవర్ధన్ రెడ్డి కి జగన్ చోటు కల్పించారు. అయితే గతంలో తాను మంత్రిగా ఉన్న సమయంలో తనకు కాకాని గోవర్ధన్ రెడ్డి ఏ మేరకు సహకరించారో అంతకు రెండింతలు సహకరిస్తానని మాజీ మంత్రిఅనిల్ కుమార్ చెప్పారు.

అన్నట్టుగానే అనిల్ కుమార్ నెల్లూరులో మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డికి పోటీగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మంత్రిగా ప్రమాణం చేసిన తర్వాత నెల్లూరు జిల్లాకు కాకాని గోవర్ధన్ రెడ్డి వచ్చిన రోజునే మాజీ మంత్రి అనిల్ కుమార్ కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసి ఘాటు విమర్శలు చేయడం జ‌రిగింది

అంతేకాదు నెల్లూరులో మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఫ్లెక్సీలను కూడా తొలగించారు. అలాగే మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డికి వైరి వర్గంగా ఉన్న వారితో కూడా వరుసగా మాజీ మంత్రి అనిల్ కుమార్ సమావేశాలు నిర్వహించడం కూడా వైసీపీలో తీవ్ర కలకలం రేపింది.

Minister, ex-minister ready for showdown in Nellore

ఈ క్ర‌మంలో వైసీపీ నేతల పంచాయితీలపై సీఎం వ‌ద్ద‌కు చేరింది. మాజీమంత్రి అనిల్‌, మంత్రి కాకాణి గోవర్దన్‌రెడ్డిలపై సీఎం ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇద్దరినీ జగన్‌  క్యాంపు ఆఫీస్‌కు పిలిపించారు.

 కొద్దిసేపటి క్రితం అనిల్‌  సీఎం జగన్‌ను కలిశారు. జిల్లాలో జరుగుతున్న పరిణామాలపై  సీఎం జగన్‌ అసంతృప్తి వ్యక్తం చేశారు. మంత్రి కాకాణిపై చేసిన విమర్శలు, ఫ్లెక్సీల చించివేతపై సీఎంకు అనిల్‌ రిచ్చినట్లు తెలుస్తోంది..

అలాగే అనిల్ కుమార్ యాదవ్ మంత్రిగా ఉన్న సమయంలో తాను ఆయనకు ఎలాంటి ఇబ్బందులు కలిగించలేదని వ్యతిరేకంగా ఒక్క మాట కూడా మాట్లాడలేదని కాకాణి గోవర్ధన్ రెడ్డి సీఎం దృష్టికి తీసుకెళ్లినట్లుగా తెలుస్తోంది.కానీ అనిల్ కుమార్ మాత్రం తనకు మంత్రి పదవి వచ్చినప్పటి నుండి ఏదో విధంగా పార్టీని ఇబ్బందుల్లోకి నెట్టేలా ప్రకటనలు చేస్తున్నారని కాకాణి చెప్పినట్లుగా తెలుస్తోంది. 

ఇద్దరు మాటల్ని విన్న‌ సీఎం జ‌గ‌న్‌.. స‌ర్దుకుపోయి కలిసి పని చేసుకోవాలని ,మీడియాకు ఎక్కి పార్టీ పరువును బజారున పడవేయవద్దని జగన్ వారిని ఆదేశించినట్లుగా తెలుస్తోంది. దానికి ఇద్దరు నేతలు అంగీకరించినట్లుగా తెలుస్తోంది.

Related posts