అందాల చందమామ కాజల్ అగర్వాల్ మంగళవారం పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని ఆమె సోదరి నిషా అగర్వాల్, భర్త గౌతమ్ కిచ్లూ సోషల్ మీడియా ద్వారా అధికారికంగా వెల్లడించారు.
అయితే.. కాజల్ కొడుకు ఎలా ఉన్నాడో, ఏం పేరు పెట్టబోతున్నారో అనే ఆసక్తి అభిమానుల్లో నెలకొంది. ఈ సందర్భంగా తమ కుమారుడి పేరు నీల్ కిచ్లూ అనే పేరు పెడుతున్నట్లు కాజల్ భర్త గౌతమ్ వెల్లడించారు. తన కొడుకుని ఈ ప్రపంచంలోకి ఆహ్వానిస్తూ ఆయన ఓ ఫోటోని పంచుకున్నారు. తమహృదయాలు ఆనందంతో నిండిపోయాయని, బ్లెస్సింగ్స్ అందించిన ప్రతి ఒక్కరికి ధన్వవాదాలు అని తెలిపారు గౌతమ్ కిచ్లు.
అంతే కాదు..కాజల్ తన ముద్దుల కొడుకు నుదుటిపై ముద్దు పెడుతున్న పిక్ ని షేర్ చేసుకుంటూ తన ఆనందాన్ని వ్యక్తం చేసింది.
టాలీవుడ్ సినీ పరిశ్రమలో అగ్రహీరోయిన్‌గా రాణిస్తున్న కాజల్ అగర్వాల్.. ముంబయి వ్యాపారవేత్త అయిన గౌతమ్ కిచ్లూతో ప్రేమలో పడ్డారు. కొద్ది రోజుల డేటింగ్ అనంతరం వారిద్దరూ 2020 అక్టోబర్ 30 తేదీన కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో వివాహం చేసుకొన్నారు. ఆ తర్వాత వారిద్దరూ విహారయాత్రల్లో దాంపత్య జీవితాన్ని ఎంజాయ్ చేస్తూ సోషల్ మీడియాలో వైరల్ అయ్యారు. మ్యారేజ్ తర్వాత కూడా ఒప్పుకున్న సినిమాలు పూర్తి చేసింది.
కొత్త ఏడాదికి స్వాగతం పలుకుతూ, ఈ ఏడాది తమ జీవితంలోకి కొత్త వ్యక్తి రాబోతున్నారని, తామకి ఈ ఇయర్ చాలా స్పెషల్ అని .భర్త గౌతమ్ కిచ్లూ సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. ప్రెగ్నెన్సీ సమయంలో కాజల్ అగర్వాల్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా కనిపించారు. ఇటీవల కాజల్ బేబీ బంప్ ఫోటోషూట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది.