మద్రాసు ఐఐటీ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు ప్రసంగించారు.
ప్రపంచమంతా ఇప్పుడు ఇండియా వైపు చూస్తోంది, ఇకపై భవిష్యత్ అంతా భారతీయులదే , ఐఐటీ మద్రాస్ అనేక విషయాల్లో దేశంలో నెంబర్ వన్ గా ఉంది అన్నారు.
ఐఐటీ మద్రాస్ ఆన్ లైన్ కోర్సులు కూడా అందిస్తోంది ఐఐటీ మద్రాస్ స్టార్టప్ అగ్నికుల్ మంచి విజయాలు అందుకుంది ఇక్కడి స్టార్టప్ లు 80 శాతం విజయవంతం అవుతున్నాయి అన్నారు.
మద్రాస్ ఐఐటీలో దాదాపు 35-40 శాతం తెలుగు విద్యార్థులే ఉన్నారు ఐఐటీల స్థాపన దేశ విద్యారంగంలో గొప్ప అడుగు ఆర్థిక సంస్కరణలు దేశ ఆర్థిక ముఖచిత్రాన్ని సమూలంగా మార్చేశాయి అని తెలిపారు.
1991 ఆర్థిక సంస్కరణలు ఎంపిక కాదు తప్పనిసరి రాజకీయ సంస్కరణల వల్ల సోవియట్ రష్యా అనేక దేశాలుగా విడిపోయింది అదే సమయంలో చైనా ఆర్థిక సంస్కరణలు ప్రారంభించింది.
ఆర్థిక సంస్కరణల తర్వాత చైనా ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఆర్ధిక వ్యవస్థగా ఎదిగింది భారత్ కూడా ఆర్ధిక సంస్కరణల తర్వాత అభివృద్ధిబాట పట్టింది అని తెలిపారు.
బ్రిటీష్ వారు దేశం నుంచి అంతా తీసుకెళ్లారు ఒక్క ఇంగ్లీష్ ను మనకు వదిలేశారు. 1990లలో కమ్యూనికేషన్ రంగం బీఎస్ఎన్ఎల్, వీఎస్ఎన్ఎల్ గుత్తాధిపత్యంగా ఉండేది.
ఆర్థిక సంస్కరణల తర్వాత కమ్యూనికేషన్ల రంగంలో ప్రైవేటు సంస్థలు వచ్చాయి కమ్యూనికేషన్ల రంగంలో ప్రైవేటు సంస్థల రాక ఓ గేమ్ ఛేంజర్ గా నిలిచాయి.
బిల్ గేట్స్ ను మొదట నేను కలుస్తానని అడిగినప్పుడు రాజకీయనేతలతో నాకు సంబంధం లేదని ఆయన అన్నారు.
నేను ఆయన్ను ఒప్పించి అపాయింట్ మెంట్ తీసుకున్నా 45 నిమిషాలు మాట్లాడాను. హైదరాబాద్ లో మైక్రోసాఫ్ట్ సంస్థను నెలకొల్పాలని కోరాను. ఇప్పుడు అదే మైక్రోసాఫ్ట్ సీఈవోగా తెలుగు వ్యక్తి సత్య నాదెళ్ల ఉన్నారు.
కొంతకాలంగా భారత్ వృద్ధిరేటు ప్రపంచంలోనే అత్యధికంగా ఉంటోంది 2014లో భారత్ పదో ఆర్థిక వ్యవస్థగా ఉండేది ఇప్పుడు 5 స్థానానికి చేరింది అన్నారు.
మనమంతా కృషి చేస్తే త్వరలోనే ప్రపంచంలోనే భారత్ అగ్రస్థానానికి చేరుకుంటుంది, భారత్ కు ఉన్న గొప్ప వరం జనాభా డెమోగ్రాఫిక్ డివిడెండ్ చాలా దేశాలు జనాభా తగ్గుదల సమస్య ఎదుర్కొంటున్నాయి భారత్ కు మరో 40 ఏళ్ల వరకూ జనాభా సమస్య లేదు అని అన్నారు.
అమెరికాలో అత్యధిక తలసరి ఆదాయం అమెరికన్ ఇండియన్లదే అమెరికాలోని ఖరీదైన ప్రాంతాల్లోకి వెళ్లి తెలుగు, తమిళంలో పిలిస్తే చాలామంది పోగవుతారు అన్నారు.
భారతీయులు ప్రపంచంలో ఏ ప్రాంతంలో అయినా సర్దుకుపోగలుగుతారు 2047 నాటికి భారతీయులు ప్రపంచంలోనే నెబంర్ వన్ అవుతారు భారతీయులు సాంకేతికతను త్వరలో అందిపుచ్చుకుంటారు అని సీఎం చంద్రబాబు తెలిపారు.
సీఎం జగన్ కు దెయ్యం పట్టింది: పంచుమర్తి అనురాధ