telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు వ్యాపార వార్తలు

షాకింగ్ : మళ్ళీ పెరిగిన బంగారం ధరలు…

కరోనా వైరస్‌ ప్రభావంతో బంగారం ధరలు ఇవాళ కూడాపెరిగిపోయాయి. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు క్రమంగా పెరిగిన విషయం తెలిసిందే. దీపావళి పండుగ అయిపోగానే బంగారం ధరలు దిగివచ్చాయి. దీపావళి కంటే ముందు బంగారం, వెండి ధరలకు రెక్కలు వచ్చాయి. కరోనా వైరస్‌ విజృంభించిన తర్వాత బంగారం ధరలు చుక్కలు చూపించిన ఇప్పుడు మళ్ళీ మార్కెట్ పుంజుకోవడంతో ధరలు తగ్గాయి. కానీ ఈరోజు ఢిల్లీలో హైదరాబాద్ లో బంగారం ధరలు కాస్త పెరిగాయి. కరోనా అనంతరం 50 వేల ను దాటిన బంగారం ఇప్పుడు మొదటిసారి కిందకి దిగ్గి వచ్చింది. అయితే ఢిల్లీలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 10 పెరిగి రూ. 52,270 పలుకుతోంది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 10 పెరిగి రూ. 47,920 వద్ద ముగిసింది. హైదరాబాద్ విషయానికి వస్తే.. బంగారం ధరలు ఇవాళ కాస్త పెరిగాయి. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 490 పెరిగి రూ.50,450కు చేరగా… అలాగే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 450 పెరిగి రూ.46,250 పలుకుతోంది. ఇక వెండి ధరలో ఇవాళ ఎలాంటి మార్పు జరుగలేదు. కిలో వెండి ధర ప్రస్తుతం రూ.71,300 వద్ద ఉంది.

Related posts