కరోనా టెస్టులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ను ఓ మహిళ జర్నలిస్ట్ ప్రశ్నించింది. ఆమె అడిగిన ప్రశ్నలు ట్రంప్ ను అసహనానికి గురిచేశాయి. దాంతో ఆయన ఆ పాత్రికేయురాలిని కూడా అసహనానికి గురిచేసే ప్రయత్నం చేసి, చివరికి మీడియా సమావేశం నుంచి అర్ధంతరంగా నిష్క్రమించారు. వైట్ హౌస్ లో ఎప్పట్లాగానే కరోనా పరిస్థితులపై ట్రంప్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి సీబీఎస్ మీడియా సంస్థ తరఫున వీజా జియాంగ్ అనే మహిళా రిపోర్టర్ హాజరైంది.
ఆమె ఓ ఆసియన్ అమెరికన్ మహిళ. ఆమె కూడా ట్రంప్ ను ఓ ప్రశ్న అడిగింది.కరోనా టెస్టుల విషయానికి వచ్చేసరికి మీరు ఇతర దేశాల కంటే మేమే బెటర్ అంటూ పదేపదే ఎందుకు చెబుతున్నారని ప్రశ్నించింది. ప్రతిరోజూ అమెరికన్లు ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితులు కనిపించడంలేదా?” అని ట్రంప్ ను ప్రశ్నించింది. వెంటనే ట్రంప్ బదులిస్తూ ఇక్కడే కాదు ప్రపంచంలో ప్రతి చోటా చనిపోతున్నారు. మరి మీరు నన్నే ఎందుకు ప్రశ్నిస్తున్నారు? చైనాను కూడా అడగొచ్చు కదా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ మీడియా సమావేశం నుంచి వెళ్లిపోయారు.


“కాళేశ్వరం” నుంచి బొట్టు నీరు కూడా వినియోగంలోకి రాలేదు: ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి