telugu navyamedia
సినిమా వార్తలు

ప్రముఖ టాలీవుడ్ దర్శకుడు కోడి రామకృష్ణకు అస్వస్థత

Kodi-Ramakrishna

ప్రముఖ టాలీవుడ్ సీనియర్ డైరెక్టర్ కోడి రామకృష్ణ అస్వస్థతకు గురయ్యారు. తాజాగా ఆయన అనారోగ్యం కారణంగా గచ్చిబౌలిలోని ఏఐజి హాస్పిటల్ లో చేరినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వైద్యులు ఆయనకు వెంటిలేటర్ మీద చికిత్స అందిస్తున్నట్లు సమాచారం. కొంతకాలం క్రితం పక్షవాతం బారిన పడ్డ ఆయన కోలుకొని ఇతరుల సహాయంతో నడవడం ప్రారంభించారు. కానీ ఈసారి మాత్రం ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని అంటున్నారు. ఈ విషయం తెలుసుకున్న కొందరు సినీ ప్రముఖులు ఇప్పటికే హాస్పిటల్ కు చేరుకున్నట్లు సమాచారం.

1982లో “ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య” చిత్రంతో కోడి రామకృష్ణ దర్శకుడిగా పరిచయమయ్యారు. కొన్ని చిత్రాల్లో నటించారు కూడా. ఆ తరువాత టాలీవుడ్ లో ఎన్నో భారీ చిత్రాలను తనదైన శైలిలో తెరకెక్కించి దాదాపు 30 ఏళ్ళుగా మంచి దర్శకుడుగా టాలీవుడ్ లో కొనసాగుతున్నారు. ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రాల్లో అమ్మోరు, అరుందతి చిత్రాలు భారీ విజయాన్ని అందుకున్నాయి.

Related posts