telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

మార్చి 27న `ఆర్ఆర్ఆర్` సర్‌ప్రైజ్

RRR1

రాజమౌళి ‘బాహుబలి’ తర్వాత పాన్ ఇండియా స్థాయిలో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం ‘RRR’.. స్వాతంత్ర్య నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొమరంభీమ్, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా కనిపించనున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రకటించినప్పటినుంచి ఇప్పటివరకు ఈ చిత్రంపై రకారకాల పుకార్లు, వార్తలు వస్తున్నాయి.. ఇటీవలే రామ్ చరణ్, అలియా భట్ పిక్స్ వైరల్ అయ్యాయి. ఈ సినిమాపై ఇప్పటికే దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ సినిమాకు సంబంధించి ఎలాంటి వార్తలూ ఇప్పటివరకు బయటకు రాలేదు. ఇద్దరు టాప్ హీరోలు నటిస్తున్న చిత్రం కావడంతో వారి అభిమానులు సినిమా అప్‌డేట్స్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సినిమాకు సంబంధించిన అప్‌డేట్స్ ఇవ్వాలంటూ సోషల్ మీడియా ద్వారా చిత్రబృందానికి విజ్ఞప్తులు చేస్తున్నారు. తాజాగా ఓ నెటిజన్ `ఆర్ఆర్ఆర్` పేజీని ట్యాగ్ చేస్తూ `అప్‌డేట్స్ ఇంకెప్పుడు ఇస్తావు` అంటూ కోపంగా ఉన్న ఎమోజీలను పోస్ట్ చేశాడు. దీనికి స్పందించిన చిత్రబృందం `మార్చి నుంచి` అని సమాధానం ఇచ్చింది. మార్చి 27వ తేదీన రామ్‌చరణ్ జన్మదినోత్సవం. ఆ సందర్భంగా `ఆర్ఆర్ఆర్`లో చెర్రీ లుక్ విడుదలవుతుందని ఎప్పట్నుంచో వార్తలు వస్తున్నాయి.

Related posts