తెలంగాణ రాష్ట్ర టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ శ్రీనివాస్ నేరుగా దేత్తడి హారికను టూరిజం బ్రాండ్ అంబాసిడర్ గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. కాగా ఈ విషయంపై వివాదం రాజుకుంది. రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రికి, ఉన్నతాధికారులకు తెలియకుండా ఈ నియామకం జరిగనట్టు తెలుస్తోంది. ఈ వ్యవహారంపై పర్యాటక మంత్రితో పాటు ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు. తాజాగా ఈ వివాదంపై హారిక స్పందించింది. ‘తెలంగాణ ప్రభుత్వం తనను టూరిజం బ్రాండ్‌గా నియమించడంపై ఆనందం వ్యక్తం చేస్తూనే.. తనను టూరిజం బ్రాండ్ అంబాసిడర్‌గా కొంత మంది అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో తాను స్వయంగా టూరిజం బ్రాండ్ అంబాసిడర్ పదవి నుంచి తప్పుకుంటున్నట్లు’ ప్రకటించింది. కాగా, తెలంగాణ ప్రభుత్వం దేత్తడి హారికను టూరిజం బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించడంపై మిశ్రమ స్పందన వ్యక్తం అయింది. కొంత మంది దేత్తడి హారికను అంబాసిడర్‌గా వ్యతిరేకించగా.. మరికొందరు మాత్రం తెలంగాణ అమ్మాయిని టూరిజం బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించడం ఎంతో గర్వకారణం అన్నారు. అయితే ప్రస్తుతం ఈ వార్త సొసైల్ మీడియాలో హల చల్ అవుతుంది. హారిక అభిమానులు ప్రభుత్వనికి వ్యతిరేకంగా కామెంట్స్ చేస్తున్నారు..
previous post