telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

22 ఏళ్ళ తర్వాత మళ్ళీ రీమేక్ తీయనున్న కృష్ణవంశీ..

సినిమా రంగంలోని స్నేహితులు, అభిమానులు కృష్ణవంశీని క్రియేటివ్ డైరెక్టర్ అని ముద్దుగా పిలుచుకుంటారు. ఆయన సినిమాల్లోని క్రియేటివిటీని పక్కన పెడితే, గత పాతికేళ్ళలో ఆయన తెరకెక్కించిన ఇరవై సినిమాల్లో అత్యధిక శాతం జయాపజయాలతో నిమిత్తం లేకుండా ఔరా! అనిపించినవే. గత కొంతకాలంగా గ్రాండ్ సక్సెస్ కోసం తెగ తపన పడుతున్న కృష్ణవంశీ… ‘చంద్రలేఖ’ తర్వాత ఇంతకాలానికి మరోసారి ఓ రీమేక్ మీద దృష్టి పెట్టారు. మరాఠీ చిత్రం ‘నటసమ్రాట్’ను ‘రంగ మార్తాండ’ పేరుతో రీమేక్ చేస్తున్నారు. 2019 నవంబర్ 25న ఈ మూవీ సెట్స్ పైకి వెళ్ళింది. ప్రకాశ్ రాజ్, రమ్యకృష్ణ, శివాత్మిక, బ్రహ్మానందం వంటి వాళ్ళు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ‘అంతఃపురం’ తర్వాత కృష్ణవంశీ ‘రంగమార్తండ’కు ఇళయరాజా స్వరాలు అందిస్తున్నారు. కరోనా మహమ్మారి మొదలు కానంతవరకూ సజావుగానే షూటింగ్ జరిగింది. ఆ తర్వాతే ఆర్థికపరమైన కష్టాలు చుట్టుముట్టిన్నట్టు వినిపిస్తోంది. బేసికల్ గా కృష్ణవంశీ ఫిల్మ్ మేకింగ్ విషయంలో రాజీ పడరు. అనుకున్నది అనుకున్నట్టు వచ్చే వరకూ తీస్తూనే ఉంటారు. ఆ పర్‌ ఫెక్షనిజం వల్లే ఆయనకు ఎంతో మంది వీరాభిమానులు ఏర్పడ్డారని చెప్పవచ్చు. మరి కృష్ణవంశీ లాంటి క్రియేటివ్ జీనియస్ ‘రంగమార్తండ’కు ఎదురైన కష్టాలను అధిగమించి త్వరలోనే జనం ముందుకు తీసుకొస్తారని ఆశిద్దాం. చూడాలి మరి ఈ సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధిస్తుందా.. లేదా అనేది.

Related posts