telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సినిమా వార్తలు

ప్రపంచవ్యాప్తంగా ఏప్రిల్ 16న రిలీజ్ కాబోతున్న ”లవ్ స్టోరి”…

Love-Story

అందమైన జోడీ నాగ చైతన్య, సాయి పల్లవి నటిస్తున్న చిత్రం ‘‘లవ్ స్టోరీ’’ సెన్సిబుల్ డైరెక్ట్ ర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం రిలీజ్ కు రెడీ అయింది.. భారీ అంచనాలున్న ఈ ప్రేమ కావ్యాన్ని ఏప్రిల్ 16న రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు మేకర్స్.. హాట్ సమ్మర్ లో కూల్ లవ్ స్టోరీని ఎంజాయ్ చేయబోతున్నారు ప్రేక్షకులు.ఈ అనౌన్స్ మెంట్ కు సంబంధించి ఓ లవ్ లీ పోస్టర్ ను వదిలింది టీమ్. ఈ
పోస్టర్ ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఇప్పటికే
రిలీజైన ఫస్ట్ లుక్ ,ఏయ్ పిల్లా సాంగ్,రీసెంట్ గా సినిమాపై అంచనాలు పెంచేశాయి.. ఇప్పుడు రిలీజ్ డేట్ అనౌన్స్ అయ్యేసరికి ఫ్యాన్స్ అంతా ఏప్రిల్ 16 కోసం వెయిట్ చేస్తున్నారు.
. ”లవ్ స్టోరి” చిత్రంలో రాజీవ్ కనకాల, ఈశ్వరీరావు, దేవయాని ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్ పీ, అమిగోస్ క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. కె నారాయణదాస్ నారంగ్, పి.రామ్మోహన్ రావు నిర్మాతలు.

సాంకేతిక నిపుణులు:
సినిమాటోగ్రఫీ: విజయ్ సి.కుమార్
మ్యూజిక్ : పవన్ సి.హెచ్
సహా నిర్మాత :భాస్కర్ కటకంశెట్టి
పి.ఆర్.వో : జి.ఎస్.కె మీడియా
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : ఐర్ల నాగేశ్వర రావు
నిర్మాతలు : నారాయణ్ దాస్ కె నారంగ్,పి.రామ్మోహన్ రావు
రచన,దర్శకత్వం: శేఖర్ కమ్ముల.

Related posts