telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలి:మంత్రి కేటీఆర్‌

KTR TRS Telangana

నియోజకవర్గంలోని అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలని అధికారులను తెలంగాణ మంత్రి కేటీఆర్‌ ఆదేశించారు. సిరిసిల్ల నియోజకవర్గ అభివృద్ధిపై జిల్లా అధికారులతో మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సిరిసిల్ల కలెక్టర్‌ కృష్ణ భాస్కర్‌, ఇతర జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. మానేరు వాగుపై ఉన్న ఎగువ మానేరు జలాశయం పర్యాటక అభివృద్ధికి అన్ని విధాలా అనుకూలంగా ఉందని మంత్రి తెలిపారు.

కాటేజీల నిర్మాణం, బోటింగ్‌, జలక్రీడలు ఇతర అభివృద్ధి కార్యక్రమాలకు ప్రణాళికలో పెద్దపీట వేయాలి. ఎగువ మానేరు జలాశయం అతిథి గృహాన్ని రూ.2కోట్లతో ఆధునీకరించాలి. అతిథి గృహం లోపలి భాగాలను అధునాతన సౌకర్యాలతో తీర్చిదిద్దాలి. నర్మాలలో ప్రాసెసింగ్‌ యూనిట్‌ స్థాపన పనులను ప్రారంభించాలని అధికారులను మంత్రి ఆదేశించారు.

Related posts