పౌరసత్వ సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ ఢిల్లీలో జరిగిన ఆందోళనల పై పోలీసులు వేర్వేరుగా రెండు కేసులు నమోదు చేశారు. ఆదివారం ఢిల్లీలోని జామియా నగర్‌లో విద్యార్థులు నిరసన వ్యక్తం చేసిన విషయం విదితమే. ఆస్తులు ధ్వంసం, అల్లర్లకు సంబంధించి సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా విచారణ చేపడుతామని పోలీసులు తెలిపారు.
కాల్పులు, అల్లర్లు, ప్రభుత్వ ఆస్తులకు నష్టం, ప్రభుత్వ పనులకు ఆటంకం కలిగించినందుకు న్యూ ఫ్రెండ్స్ కాలనీ పోలీస్ స్టేషన్‌లో మొదటి కేసు నమోదైంది. అల్లర్లు, రాళ్ళు రువ్వడం, ప్రభుత్వ పనులకు ఆటంకం కలిగించినందుకు జామియా నగర్ పోలీస్ స్టేషన్‌లో రెండవ కేసు నమోదైనట్లు పోలీసులు వెల్లడించారు.