బాలీవుడ్ సెలబ్రిటీ కపుల్ దీపికా పదుకొణె, రణవీర్సింగ్లు ఇటీవల ఓ వివాహ వేడుకకు హాజరయ్యారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఈ ఫొటోల్లో దీపికతో పాటు మరో హీరోయిన్ కూడా కన్పించడమే ఇందుకు కారణం. ఈ ఫోటోల ద్వారా దీపికకు “అతిథి” హీరోయిన్ అమృతారావ్తో చుట్టరికం ఉందనే విషయం వెల్లడైంది. దీపిక, రణవీర్ దంపతులు కలిసి దీపిక కజిన్ వివాహానికి హాజరయ్యారు. దీపిక కజిన్ సోదరుడు, అమృతరావ్ కజిన్ సోదరిని వివాహం చేసుకున్నాడు. ఈ పెళ్లికి సంబంధించిన ఫొటోలు బయటకు రావడంతో ఈ ఇద్దరు హీరోయిన్ల చుట్టరికం హాట్ టాపిక్ గా మారింది. కాగా ఈ వేడుకకు సంబంధించిన ఒక ఫొటోలో రణవీర్.. దీపిక శాండిల్స్ను చేతితో పట్టకున్నాడు. దీనిని చూసిన అభిమానులు దీపికను ఆమె భర్త రణవీర్ కనుపాపలా చేసుకుంటున్నాడని, అద్భుతమైన జంట అంటూ కొనియాడుతున్నారు.
							previous post
						
						
					
							next post
						
						
					


బాలకృష్ణ వ్యాఖ్యలపై ఇప్పుడు స్పందించను : మంత్రి తలసాని