telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ప్రభాస్ సినిమాలో కాజల్ ?

Kajal

అందాల చందమామ కాజల్ అగర్వాల్ తెలుగు, తమిళ భాషల్లో స్టార్ హీరోల సరసన వరుస సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్ గా దూసుకెళ్తోంది. కాజ‌ల్ ఇటీవలే కోమ‌లి, రణ‌రంగం చిత్రాలతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. ఇందులో “కోమలి” చిత్రంతో మంచి విజయాన్ని అందుకుంది. బాలీవుడ్లో ” ముంబై స‌గ” అనే చిత్రంలో జాన్ అబ్ర‌హంతో రొమాన్స్ చేయ‌నుంద‌ట‌. సంజ‌య్ గుప్తా ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో సునీల్ శెట్టి, జాకీ ష్రాఫ్ కీల‌క పాత్ర‌లు పోషించ‌నున్నార‌ని స‌మాచారం. క ఆమె న‌టించిన‌ “పారిస్ పారిస్” కూడా విజయం సాధిస్తుందని కాజల్ ధీమాగా ఉంది. మరోవైపు కమల్-శంకర్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ చిత్రం “భారతీయుడు-2″లో నటిస్తోంది. ఇదీ కాక శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమాలో సూర్యతో జ‌త‌క‌ట్ట‌నుంది కాజ‌ల్‌. “కాల్ సెంటర్” అనే మరో చిత్రంలో కూడా నటిస్తోంది. కాగా… “డార్లింగ్”, “మిస్టర్ పర్‌ఫెక్ట్” వంటి విజయవంతమైన చిత్రాల్లో నటించి హిట్ పెయిర్ అనిపించుకున్నారు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, కాజల్ అగర్వాల్. “మిస్టర్ పర్‌ఫెక్ట్” తర్వాత వీరిద్దరూ మళ్లీ కలిసి నటించలేదు. త్వరలోనే వీరిద్దరూ మళ్లీ కలిసి కనిపించబోతున్నారట. ప్రభాస్ సినిమాలో కాజల్ కనిపించబోతోందట. అయితే హీరోయిన్‌ పాత్రలో కాదు.. కామియో రోల్‌లో అని సమాచారం. ప్రభాస్ ప్రస్తుతం ఎస్.రాధాకృష్ణ రూపొందిస్తున్న పీరియాడిక్ లవ్‌స్టోరీ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. 1970వ దశకం బ్యాక్‌డ్రాప్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో పూజా హెగ్డే కథానాయిక. ఈ సినిమాలోనే ఓ అతిథి పాత్రలో కాజల్ నటించబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. మరి, ఇందులో నిజమెంతుందో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.

Related posts