telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఆటో డ్రైవర్లకు శానిటైజ‌ర్స్ పంపిణీ చేసిన ప్రణీత

Pranitha

బెంగ‌ళూరు బ్యూటీ ప్ర‌ణీత క‌రోనా సంక్షోభంలో త‌న వంతు సాయాన్నిఅందిస్తూ తన మంచి మనసుని చాటుకుంటోంది. తాజాగా ఆటో డ్రైవ‌ర్స్‌కి శానిటైజ‌ర్స్ పంపిణీ చేసింది ప్ర‌ణీత‌. బెంగ‌ళూరులో ఆటోలు తిర‌గ‌డం మొద‌ల‌య్యాయి. ఇలాంటి స‌మ‌యంలో అప్ర‌మ‌త్త‌గా ఉండాల్సిన అవ‌స‌రం ఉంది. ఆటోడ్రైవ‌ర్స్‌, క‌స్ట‌మ‌ర్స్‌ను వేరు చేసేలా షీట్స్ ఉండ‌టం ఎంతో ముఖ్యం. కాబ‌ట్టి 100కి పైగా ఆటోడ్రైవ‌ర్స్‌కు ఇలాంటి షీట్స్‌తో పాటు శానిటైజ‌ర్స్‌ను కూడా పంపిణీ చేశాం అని ప్ర‌ణీత త‌న ట్వీట్ ద్వారా పేర్కొన్నారు. స్టార్ హీరోలు కూడా చేయ‌ని ప‌నుల‌ని తాను చేస్తూ అంద‌రికి ఆద‌ర్శంగా నిలుస్తుంది. ఆ మ‌ధ్య త‌న‌ వంతు సాయంగా ఒక్కో కుటుంబానికి రూ.2000 చొప్పున 50 కుటుంబాలకు లక్ష రూపాయలను విరాళంగా అందించింది. అంతేకాదు స్వ‌యంగా వంట చేస్తూ పేద‌ల‌కి పంచుతుంది కూడా. ప్రణీత చేస్తున్న ఈ సామాజిక కార్య‌క్ర‌మాల‌పై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపిస్తున్నారు నెటిజన్స్.

Related posts