telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

అదిరింది షో : నాగబాబుపై నెటిజెన్లు ఫైర్

Nagababu

జబర్దస్త్‌లో క్రియేటీవ్ డిఫెరన్స్ వల్లే బయటకు వచ్చానని, అక్కడంతా కార్పొరేట్ స్టైల్‌ అని, ఆర్టిస్ట్‌లకు ఏమైనా సరే వారు పట్టించుకోరంటూ తీవ్ర విమర్శలు చేశారు నాగబాబు. అలాగే జబర్దస్త్ కమెడియన్స్‌ను చెప్పకుండా తీసేశారని, అయితే అలా ఎలా తీసేస్తారని ఆరోపణలు చేశారు. ఇదే ప్రధాన ఆరోపణగా కూడా చెప్పుకొచ్చారు. కానీ ఇప్పుడు నాగబాబు కూడా అదే విమర్శలు ఎదుర్కొంటున్నారు. ‘అదిరింది’ షో యాంకర్‌గా సమీరాను 26 ఎపిసోడ్స్‌ కోసం సైన్ చేసుకున్నారట. కానీ మధ్యలో ఏమైందో ఏమో కానీ 10 ఎపిసోడ్స్ కాగానే ఆమెను తొలగించారు. కనీసం ఈ విషయాన్ని ఆమెకు కూడా చెప్పలేదట. ఇదే విషయంలో నాగబాబు ప్రస్తుతం విమర్శలు ఎదుర్కొంటున్నాడు. చెప్పకుండా ఆర్టిస్ట్‌లను తీశారంటూ జబర్దస్త్‌పై విమర్శలు చేసిన నాగబాబు.. అదిరిందిపై మరి మౌనమెందుకు వహిస్తున్నారంటూ నెటిజెన్లు ఫైర్ అవుతున్నారు. అగ్రిమెంట్ రాసుకున్నా కూడా అలా మధ్యలోనే ఎలా తీస్తారు? ఈ విషయంపై ఎందుకు ప్రశ్నించడం లేదంటూ నాగబాబుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Related posts