telugu navyamedia
క్రీడలు వార్తలు

సన్‌‌రైజర్స్ క్యాంప్‌లో జాయిన్ అయిన డేవిడ్ భాయ్…

ఏప్రిల్ 9 నుంచి మే 30 వరకు జరిగే ఈ క్యాషిరిచ్ లీగ్ కోసం ఫ్రాంచైజీలన్నీ సమయాత్తం అవుతున్నాయి. ఇప్పటికే ఆటగాళ్లంతా ఆయా జట్లతో కలిసారు. ఇక తాజాగా సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ డేవిడ్ వార్నర్, స్టార్ బ్యాట్స్‌మన్ కేన్ విలియమ్సన్ శుక్రవారం జట్టుతో కలిసారు. ఈ విషయాన్ని సన్‌రైజర్స్ హైదరాబాద్ ట్విటర్ వేదికగా వెల్లడించింది. ఈ ఇద్దరూ సన్‌‌రైజర్స్ క్యాంప్‌లో జాయిన్ అయ్యారని తెలియజేస్తూ.. ‘ఈగల్స్ ల్యాండ్ అయ్యారనే’క్యాప్షన్‌తో హైదరాబాద్ ఫ్రాంచైజీ ట్వీట్ చేసింది. ‘ఈగల్స్ ల్యాండ్ అయ్యారు. మరోసారి చెబుతున్నాం.. ఈగల్స్ వచ్చేశారు. కెప్టెన్ డేవిడ్ వార్నర్, కేన్ విలియమ్సన్, బ్రాడ్ హడిన్‌‌కు చెన్నైకి సాధర స్వాగతం’అని పేర్కొంది. డేవిడ్ వార్నర్ రాకపై ముందే అప్‌డేట్ రాగా.. చెప్పాపెట్టకుండా వచ్చి కేన్‌మామ అందరికి సర్‌ప్రైజ్ ఇచ్చాడు. వీరితోనే బ్రాడ్ హడిన్ కూడా చెన్నైకి చేరుకున్నాడు. అయితే ఐపీఎల్ నిబంధనల ప్రకారం వీరు వారం రోజుల పాటు క్వారంటైన్‌లో ఉండనున్నారు. అయితే ఏప్రిల్‌ 11న సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌, కోల్‌కతా నైట్‌ రైడర్స్‌తో తొలి మ్యాచ్ ఆడనుంది.

Related posts