telugu navyamedia
రాజకీయ వార్తలు

హిందూ గ్రంధాల్లో కావాల్సినంత హింస: సీతారాం ఏచూరి

CPM leader Ecchuri comments Hindu Books

హిందువులు హింసకు దూరంగా ఉంటారనిబీజేపీ నాయకురాలు సాధ్వి ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ చేసిన వ్యాఖ్యలకు సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ఘాటుగా స్పందించారు. హిందూ గ్రంధాల్లో కావాల్సినంత హింస ఉందని ఆయన అన్నారు. ఈ దేశంలోని ఎంతో మంది హిందూ రాజులు, రాజ్యాల మధ్య లెక్కలేనన్ని యుద్ధాలు జరిగాయని చెప్పారు. హిందువులు అత్యంత పవిత్రంగా భావించే రామాయణ, మహాభారతాల్లో ఉన్నదంతా యుద్ధం, హింసేనని అన్నారు.

హిందూ పురాణాల్లో ఏముందో ఎన్నికల ప్రచారంలో బీజేపీ నేతలు చెప్పాలని సూచించారు. హిందువులు హింసకు అతీతమని మాత్రం దయచేసి చెప్పవద్దని ఆయన వ్యాఖ్యానించారు. హింస కేవలం ఒక మతంలో మాత్రమే ఉందని, హిందూ మతంలో హింస లేదని చెప్పడంలో లాజిక్ లేదని ఏచూరి అన్నారు. ఎన్నికల సమీపించగానే ప్రజల భావోద్వేగాలతో బీజేపీ రాజకీయం చేయడం ప్రారంభిస్తుందని విమర్శించారు. ఎన్నికల సమయంలో వారికి రామ మందిరం గుర్తుకు వస్తుందని దుయ్యబట్టారు.

Related posts