telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు

ఆంధ్రా స్కూల్స్ లో కరోనా టెన్షన్..

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ స్కూల్స్‌లో కరోనా వ్యాప్తి కలకలం రేపుతోంది. స్కూల్స్ ఓపెన్‌ అయిన నాలుగు రోజుల్లోనే రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు, విద్యార్థులకు పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో స్కూల్స్‌కు పిల్లలను పంపేందుకు తల్లితండ్రులు ఆసక్తి చూపించడం లేదు. ఫలితంగా స్కూల్స్‌లో హాజరు శాతం సగాన్ని మించడం లేదు. స్కూళ్లు తెరిచిన వెంటనే భారీగా కేసులు నమోదవుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 829 మంది టీచర్లు, 575 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు తెలుస్తోంది. దీంతో విద్యార్థులు, తల్లిదండ్రుల్లో ఆందోళన పెరుగుతోంది. నెల్లూరు జిల్లాలో పాఠశాలలు ప్రారంభించిన తర్వాత ఉపాధ్యాయులు, పిల్లలకు జరిపిన కరోనా టెస్టులలో మొత్తం 65 కరోనా కేసులు బయట పడ్డాయి. పశ్చిమ గోదావరి జిల్లా లో ఇప్పటివరకు 120 మంది టీచర్లు, 200 మందికి‌ పైగా విద్యార్దులకు పాజిటివ్‌గా తేలింది.  కామవరపుకోట మండలం ఈస్ట్ యడవల్లి హైస్కూల్‌‌లో పది మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్ రిపోర్ట్‌ వచ్చింది.కృష్ణాజిల్లాలోనూ కేసులు వెలుగుచూస్తున్నాయి. నిడమనూరు ప్రభుత్వ పాఠశాలలో శానిటైజేషన్ చేయడం లేదంటూ పేరెంట్స్ హెడ్‌మాస్టర్‌తో గొడవకు దిగారు.

Related posts