telugu navyamedia
రాజకీయ వార్తలు

లోక్‌సభ ప్రొటెం స్పీకర్‌గా వీరేంద్ర కుమార్‌

virendra_kumar bjp mp

లోక్‌సభ ప్రొటెం స్పీకర్‌గా బీజీపీ ఎంపీ వీరేంద్ర కుమార్‌ నియామకం అయ్యారు. 17వ తేదీ నుంచి పార్లమెంట్‌ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. లోక్‌సభకు ఎన్నికైన ఎంపీలతో వీరేంద్ర కుమార్‌ ప్రమాణస్వీకారం చేయించనున్నారు. ఈ నెల 19న లోక్‌సభ స్పీకర్‌ ఎన్నిక ప్రక్రియ ప్రొటెం స్పీకర్‌ నిర్వహించనున్నారు. వీరేంద్ర కుమార్‌ లోక్‌సభకు ఏడుసార్లు ఎంపికయ్యారు. మధ్యప్రదేశ్‌లోని తికమ్‌గర్హ్‌ నియోజకవర్గం నుంచి వీరేంద్ర కుమార్‌ లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

దళిత కులానికి చెందిన వీరేంద్ర కుమార్‌ ఎకనామిక్స్‌లో మాస్టర్స్‌ డిగ్రీ, చైల్డ్‌ లేబర్‌ అంశంపై పీహెచ్‌డీ చేశారు.సాగర్‌ జిల్లా ఏబీవీపీ కన్వీనర్‌గా 1977-79 మధ్య కాలంలో పని చేశారు. 2014-19 మధ్య కాలంలో మహిళా, శిశు అభివృద్ధి శాఖ, మైనార్టీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రిగా సేవలందించారు. 1975లో జేపీ ఉద్యమంలో  చురుగ్గా పాల్గొన్నారు. ఎమర్జెన్సీ సమయంలో 16 నెలల పాటు జైలు లో ఉన్నారు.

Related posts