జమ్మూకశ్మీర్ కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పిస్తున్న ఆర్టికల్ 370ని రద్దు చేయడంతో శత్రు దేశమైన పాకిస్తాన్ ఉక్కిరిబిక్కిరవుతుంది. జమ్మూకశ్మీర్ రాష్ట్రాన్ని రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విడదీయడం పాకిస్థాన్ కు మింగుడు పడటం లేదు. ఓపక్క జమ్మూకశ్మీర్ లో దాడులు చేసేందుకు ఉగ్రవాదులను ప్రేరేపిస్తోంది.
మరోవైపు, సరిహద్దుల్లో యుద్ధ వాతావరణాన్నిసృష్టిస్తోంది. ఈ క్రమంలో లడఖ్ సరిహద్దులో ఉన్న స్కర్దూ ఎయిర్ బేస్ కు మూడు సీ-130 యుద్ధ విమానాలను తరలించింది. జేఎఫ్-17 ఫైటర్ జెట్లను కూడా తరలించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో భారత్ అప్రమత్తమైంది. సరిహద్దుల వెంబడి నిఘాను ముమ్మరం చేసింది. పాకిస్థాన్ ఎయిర్ ఫోర్స్ కదలికలను భారత నిఘా వ్యవస్థ ఎప్పటికప్పుడూ గమనిస్తోంది.