telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

మోహన్‌లాల్ ‘మరక్కార్’ చిత్రానికి కరోనా ఎఫెక్ట్

marakkar

కేరళలో కరోనా కేసులు పెరుగుతుండటంతో కేరళ ప్రభుత్వం అప్రమత్తమైంది. కేరళలో 12వ కరోనా కేసు నమోదైనట్టు మంగళవారం ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. రక్షణ చర్యలను మరింత కట్టుదిట్టం చేసింది. మార్చి 31 వరకు రాష్ట్రంలో సినిమా థియేటర్లు మూసివేయాలని ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఆదేశాలు జారీ చేశారు. వైరస్ మరింత వ్యాప్తి చెందకుండా ఉండటానికి విద్యా సంస్థలకు కూడా ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. కాగా, కేరళ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం అక్కడి సినీ పరిశ్రమపై భారీ ప్రభావం చూపనుంది. ఈ నెలలో విడుదల కావాల్సిన సినిమాలు వాయిదా పడనున్నాయి. వాయిదా పడే సినిమాల్లో మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్ భారీ చిత్రం ‘మరక్కార్: అరబికడలింటే సింహం’ ఉంది. ప్రముఖ దర్శకుడు ప్రియదర్శన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా మార్చి 26న విడుదల కావాల్సి ఉంది. పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాను రూ.100 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మించారు. ఆంటొని పెరుంబవూర్, ఆశీర్వాద్ సినిమాస్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం మలయాళ సినీ చరిత్రలోనే భారీ బడ్జెట్ మూవీ. ఈ సినిమా తెలుగు ట్రైలర్‌ను ఇటీవల మెగాస్టార్ చిరంజీవి విడుదల చేశారు. తెలుగులో ‘మరక్కార్: అరేబియా సముద్ర సింహం’ అనే టైటిల్‌తో వస్తోంది.

Related posts