telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ప్రపంచ కప్ ఫైనల్లో ఎన్టీఆర్ పాట

NTR

‘బాహుబలి’ తో రాజమౌళి క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ఇప్పుడు ‘RRR’ తో కూడా జూనియర్ క్రేజ్ పెంచుకోబోతున్నాడు. రీసెంట్‌గా ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో మహిళల టి20 ప్రపంచ కప్ ఫైనల్ జరిగింది. ఆ మ్యాచ్‌లో ఇండియా, ఆస్ట్రేలియా జట్లు తలపడ్డాయి. ఇండియాని ఓడించి కప్ అందుకుంది ఆస్ట్రేలియా. అయితే ఇక్కడ ఆసక్తికర విషయం ఏంటంటే.. ఆ ఫైనల్ జరుగుతున్నప్పుడు స్టేడియంలో ఎన్టీఆర్ సినిమాలోని ఓ పాటను ప్లే చేసారు. ఎన్టీఆర్ కెరీర్‌లో బ్లాక్ బస్టర్‌గా నిలిచిన ‘జనతా గ్యారేజ్’ సినిమాలో పక్కా లోకల్ సాంగ్ అక్కడ మార్మోగింది. ఆ మ్యాచ్ చూస్తున్న ఒక ఆడియెన్ ఆ పాట రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు. దానికి ‘జనతా గ్యారేజ్’ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ లైక్ కొట్టడంతో ఇప్పుడు ఆ పోస్ట్ వైరల్‌గా మారింది.

Related posts