‘‘సన్నివేశం చెప్పగానే పకోడీ పొట్లం కట్టేసినంత సులువుగా పాట కట్టేయడం, చేంజెస్ అడిగితే టీ తాగేలోపు చేసేయడం.. ‘‘భాస్కరభట్లకి ‘పెన్ను’తో పెట్టిన విద్య’’. నా చిత్రాలతో పాటు మరెన్నో చిత్రాలకు అద్భుతమైన పాటలను ఇచ్చిన భాస్కరభట్లకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. లవ్ యూ… భాస్కరభట్ల… ప్రేమతో… ‘సంఘనభట్ల’..” అంటూ ట్వీట్ చేశారు దర్శకుడు హరీష్ శంకర్. పాటల రచయిత భాస్కర భట్ల.. సినిమా పాటలు రాయడం మొదలెట్టి 21 జూలై, 2020కి 20 సంవత్సరాలు పూర్తయింది. ఈ సందర్భంగా భాస్కరభట్లను అభినందిస్తూ హరీష్ శంకర్ ట్వీట్ చేశారు. ‘గొప్పింటి అల్లుడు’ చిత్రం నుంచి ‘ఆకాశం నీ హద్దురా!’ చిత్రం వరకు ‘20 ఇయర్స్ ఆఫ్ భాస్కరభట్ల’ అని ఓ పోస్టర్‌ను ఆయన పోస్ట్ చేశారు. దీంతో ఆయనకు సెలబ్రిటీలూ, అభిమానులు.. అందరూ శుభాకాంక్షలు తెలుపుతూ కామెంట్స్ చేస్తున్నారు. హరీష్ శంకర్ ట్వీట్ కు స్పందించిన భాస్కరభట్ల “అన్నయ్యా నీ ప్రేమకి నమస్కారం… నీ ప్రతి సినిమాలో నాచేత పాటలు రాయిస్తున్నందుకు నమస్కారాలు..’’ అని పేర్కొన్నారు.
సన్నివేశం చెప్పగానే పకోడీ పొట్లం కట్టేసినంత సులువుగా పాట కట్టేయడం, చేంజెస్ అడిగితే టీ తాగేలోపు చేసేయడం “భాస్కరభట్ల కి ‘పెన్ను’తో పెట్టిన విద్య”.
Thankyou for the wonderful songs in my Films and in many films.
లవ్ యూ… ‘భాస్కరభట్ల’
ప్రేమతో… ‘సంఘనభట్ల’ @bhaskarabhatla pic.twitter.com/2RRQhQiN1Q— Harish Shankar .S (@harish2you) July 21, 2020