ప్రపంచ దేశాలను అల్లాడిస్తున్న కరోనా వైరస్ పట్ల తెలంగాణ ప్రభుత్వం పకడ్బంధీ ఏర్పాట్లు చేసింది. ఈ వైరస్ పై ప్రజల్లో ఎప్పటికప్పుడు అవగాహన కల్పిస్తూ నివారణ చార్యాలు చేపట్టింది. ఇందులో భాగంగా ప్రభుత్వం కంట్రోల్ రూం కూడా ఏర్పాటు చేసింది. కాంటాక్ట్ నంబర్స్‌ను కూడా ప్రకటించింది. కంట్రోల్ రూమ్.. కాంటాక్ట్ నంబర్స్: 040-23450624, 040-23450735.
ఇటీవలి కాలంలో విదేశాల నుంచి లేదా దేశంలోని ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారి వివరాలను స్వచ్ఛందంగా కంట్రోల్ రూమ్‌కు ఫోన్ చేసి తెలియజేయాలని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ కోరింది. కరోనా అనుమానిత లక్షణాలు ఉంటే తక్షణమే ప్రభుత్వానికి, అధికారులకు తెలియజేయాలని చెప్పింది. ఇప్పటికే పలు పట్టణాల్లో అధికారులు ఇంటింటి సర్వే నిర్వహించి విదేశాల నుంచి వచ్చిన వారి వివరాలను సేకరిస్తున్నారు.