telugu navyamedia
రాజకీయ

సుభాష్ చంద్రబోస్ విగ్రహం.. భవిష్యత్ తరాలకు స్ఫూర్తి..

స్వాతంత్ర్య సమరయోధుడు ఆజద్ హిందూ ఫౌజ్ దళపతి, నేతాజీ సుభాష్ చంద్రబోస్ 125వ జయంతి సంద‌ర్భంగా ..నేతాజీ హోలోగ్రామ్ విగ్రహాన్ని ఇండియా గేట్ వద్ద ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆదివారం ఆవిష్కరించారు.

Netaji's hologram statue unveiled, PM Modi reaches India Gate |  Dailyindia.net

ఈ హోలోగ్రామ్ విగ్రహం 28 అడుగుల ఎత్తు, 6 అడుగుల వెడల్పు ఉంటుంది. ఇండియా గేట్ వద్ద నేతాజీ సుభాష్ చంద్రబోస్ భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని, గ్రానైట్ విగ్రహం పూర్తయ్యే వరకు అక్కడ ఆయన హోలోగ్రామ్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని ప్రధాని మోడీ తెలిపారు. ఈ విగ్రహం స్వాతంత్ర్య మహానాయకుడికి కృతజ్ఞతతో కూడిన జాతికి నివాళి. ఈ విగ్రహం మన భవిష్యత్ తరాలకు స్ఫూర్తిగా నిలుస్తుంది’’ అని అన్నారు.

నేతాజీ విగ్రహావిష్కరణ సందర్భంగా ప్రధాని మోడీ మాట్లాడుతూ.. ఏదైనా సాధించగలం అనే నేతాజీ నినాదాన్ని ప్రేరణగా తీసుకోవాలని తెలిపారు. భారతమాత వీర పుత్రుడు సుభాష్ చంద్రబోస్ బ్రిటీష్ ప్రభుత్వం ముందు తల వంచడానికి నిరాకరించారని తెలిపారు . తాను స్వాతంత్య్రం కోసం అడుక్కోనని, దాన్ని సాధించుకుంటానని గర్వంగా చెప్పారని అన్నారు. 

Narendra Modi Jan 23 Schedule: PM to unveil hologram statue of Netaji  Subhas Chandra Bose

స్వతంత్ర భారతావనిని తీసుకువచ్చే ఆకాంక్షను ఎప్పటికీ కోల్పోవద్దని, భారత్​ను కదిలించే శక్తి ఎవరికీ లేదని నేతాజీ చెప్పేవారు. ఆజాద్‌ హింద్‌ ఫౌజ్‌ ఆర్మీని స్థాపించి దేశం కోసం సాహసం, పరాక్రమం చూపారని అన్నారు. నేతాజీ దేశానికి గొప్ప వారసత్వాన్ని అందించారని ప్రధాని కొనియాడారు. నేతాజీతో ముడిపడి ఉన్న అన్ని ప్రదేశాలను స్మారక ప్రదేశాలుగా మారుస్తున్నామని ప్రధాని పేర్కొన్నారు.

స్వతంత్ర భారత్​ కలలను సాకారం చేయటమే మన ముందు ఉన్న లక్ష్యం. 100వ స్వాతంత్య్ర దినోత్సవంలోపు నవ భారత్​ను రూపొందించాలి. నేతాజీ సుభాష్​ చంద్రబోస్​కు సంబంధించిన రహస్య దస్త్రాలను బయటపెట్టే అవకాశం మా ప్రభుత్వానికి లభించటం అదృష్టంగా భావిస్తున్నా అని ఈ సంద‌ర్భంగా మోదీ తెలిపారు.

అనంతరం 2019, 2020, 2021, 2022 ఏడాదికి గాను సుభాష్ చంద్ర బోస్​ అప్డా ప్రబంధన్​ పురస్కారాలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రదానం చేశారు.మొత్తం 7 అవార్డులను ప్రధాని అందజేశారు.

విపత్తు నిర్వహణ రంగంలో భారతదేశంలోని వివిధ వ్యక్తులు, సంస్థలు అందించిన అమూల్యమైన సహకారం, నిస్వార్థ సేవలను ప్రశంసించడానికి, గౌరవించడానికి కేంద్ర ప్రభుత్వం వార్షిక సుభాష్ చంద్రబోస్ ఆపద ప్రబంధన్ పురస్కారాన్ని ఏర్పాటు చేసింది. ఈ అవార్డు కింద ఓ సంస్థకు రూ.51 లక్షల నగదు బహుమతితో పాటు సర్టిఫికెట్, వ్యక్తికి రూ.5 లక్షలు, ప్రశంసాపత్రం అందజేస్తారు.

Related posts