telugu navyamedia
సామాజిక

16 నుంచి శ‌బ‌రిమ‌ల అయ్య‌ప్ప ద‌ర్శ‌నం..

కేర‌ళ‌..ట్రావెల్‌కోర్ ట్ర‌స్ట్ ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హిస్తున్న ఆల‌యం శ‌బ‌రిమ‌ల దేవాల‌యం, భ‌క్తులకు ట్ర‌స్ట్ నిర్వాహ‌కులు తీపి క‌బురు చెప్పారు. ఈ నెల 15 సోమవారం నుంచి శబరిమల ఆలయం తెరుచుకోనుంది. సోమవారం నుంచి భక్తులు అయ్యప్పస్వామిని దర్శించుకునేందుకు అనుమతినిచ్చింది. మండల మకర విళక్కు పండగ సందర్భంగా భక్తులు సందర్శించడానికి అధికారులు అనుమతి ఇచ్చారు.

Sabarimala temple opens; RT-PCR report or vaccine certificate must | Latest News India - Hindustan Times

15న సాయంత్రం ఆలయ ప్రధాన అర్చకుల సమక్షంలో గర్భగుడిని తెరుస్తారు. ఈ నెల‌ 16 నుంచి భక్తుల ద‌ర్శనానికి అనుమతి ఇవ్వనున్నారు. డిసెంబర్ 26న మండల పూజ ముగుస్తుంది. మళ్లీ డిసెంబర్ 30న ఆలయాన్ని తెరుస్తారు. 2022 జనవరి 14న మకరజ్యోతి దర్శనం ఉంటుంది. మళ్లీ అదే నెల 20న ఆలయాన్ని మూసివేయనున్నట్లు దేవస్థానం అధికారులు తెలిపారు. కరోనా నిబంధనల ప్రకారం రోజుకు 30 వేల మందిని దర్శనం కోసం అనుమతి ఇవ్వనున్నారు.

Related posts