*కాంగ్రెస్ రాజ్‌భవన్ ముట్టడిలో ఉద్రిక్తత..
*రాజ్‌భవన్ వైపు దూసుకెళ్లిన కాంగ్రెస్ కార్యకర్తలు..
*రాహుల్ ఈడీ విచారణలో భాగంగా ఆందోళనలు
*ద్విచక్రవాహనాన్ని తగులబెట్టిన ఆందోళనకారులు
*ఆర్టీసీ బస్సు పై కార్యకర్తలు దాడి..అద్దాలు ధ్వంసం
*పోలీసులు కార్యకర్తల మధ్య వాగ్వాదం..
రాహుల్ ఈడీ విచారణ నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ చేపట్టిన ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. కాంగ్రెస్ శ్రేణులు పెద్ద సంఖ్యలో రాజ్ భవన్ వైపు దూసుకెళ్లేందుకు ప్రయత్నం చేయగా, పోలీసులు బారీకేడ్లను ఏర్పాటు చేశారు. దీంతో కాంగ్రెస్ శ్రేణులను పోలీసులు వాగ్వాదం చేయడంతో ఉద్రిక్తత నెలకొంది.
ఖైరతాబాద్ చౌరస్తాలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సహా జగ్గారెడ్డి, శ్రీధర్ బాబు తదితరులు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు.
ఈ క్రమంలో యువజన కాంగ్రెస్ నేతలు బైక్‌కు నిప్పు పెట్టారు. బస్సులను రాకపోకలను అడ్డుకుని నిరసనకు దిగారు. ఆర్టీసీ బస్సు అద్దాలను ధ్వంసం చేశారు. యూత్ కాంగ్రెస్ నేత అనిల్ కుమార్ యాదవ్ ఆర్టీసీ బస్ ఎక్కి నిరసన తెలిపారు.
దీంతో పోలీసులు పలువురు ఆందోళనకారుల్ని అదుపులోకి తీసుకున్నారు. ఆందోళన చేస్తున్న రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క సహా పలువురు నేతల్ని పోలీసులు అరెస్ట్ చేశారు.జగ్గారెడ్డిని తీసుకెళ్లి పోలీసు వాహనంలో బంధించారు.
మరోవైపు కాంగ్రెస్ నేతల ఆందోళనలతో అమీర్ పేట, పంజాగుట్ట, నాంపల్లి, ఖైరతాబాద్ లలో భారీగా ట్రాఫిక్ జామ్ చోటు చేసుకొంది. రోడ్లపైనే వందలాది వాహనాలు నిలిచిపోయాయి. వాహనదారులు ఇబ్బంది పడ్డారు.