telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు

కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి : నాగార్జున సాగర్‌లో కాంగ్రెస్ గెలవక పోతే..?

కాంగ్రెస్ సీనియర్ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి.. యాదాద్రిలో మీడియాతో మాట్లాడుతూ.. నాగార్జున సాగర్‌లో కాంగ్రెస్ గెలవక పోతే రాజకీయాలు గురించి మాట్లాడనంటూ వ్యఖ్యానించారు.. నాగార్జునసాగర్ లో జానారెడ్డి గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.. ఇక, ఐకేపీ సెంటర్లు బంద్ పెడితే టిఆర్ఎస్ ఎంపీ, మంత్రులు ఎమ్మెల్యేలను రైతులు ఉరికించి కొడతారని హెచ్చరించారు కోమటిరెడ్డి.. రైతు చట్టాలకు వ్యతిరేకంగా కేరళ  ప్రభుత్వ తరహాలో.. రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేయాలని డిమాండ్‌ చేసిన ఆయన.. కేసీఆర్ అవినీతి పై బీజేపీ రాజీపడ్డా.. మేం వదిలిపెట్టె ప్రసక్తే లేదంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ స్వగ్రామం చింతమడకలో ఉన్నవారు అమెరికాలో ఉన్నా.. వారికి డబ్బులు ఇచ్చిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందని సెటైర్లు వేశారు కోమటిరెడ్డి.. కానీ, యాదగిరిగుట్టలో షాపులు, ఇండ్లు కోల్పోయిన వారికి డబ్బులు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు.  మరోవైపు.. నాగార్జునసాగర్ లో ఎన్నికలు వస్తున్నాయి అంటే అక్కడ నిధులు మంజూరు చేస్తున్నారంటూ ఆరోపించారు కోమటిరెడ్డి… ఎన్నికల గురించి ఏడేళ్లుగా పట్టించుకోని నాయకులు.. ఇప్పుడు గొర్రెలు పంపిణీ చేస్తున్నారని విమర్శించిన ఆయన.. గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికల్లో మత రాజకీయాల వల్ల కాంగ్రెస్ పార్టీ ఇబ్బంది పడిందన్నారు. జిల్లా మంత్రి భువనగిరిని పట్టించుకోవడం లేదు.. కాంగ్రెస్ పార్టీ కేంద్రం నుండి నిధులు తెచ్చి అభివృద్ధి చేస్తుందన్నారు కోమటిరెడ్డి.. అభివృద్ధి కార్యక్రమాలు ఒక్క వైపు చేస్తూ.. మరో వైపు పోరాటలు చేస్తున్నామన్న ఆయన.. రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఉన్నాడా లేడా ? అంటూ మండిపడ్డారు.. ఇక, యాదగిరిగుట్టలో నీ ఫామ్ హౌస్‌ రోడ్డు కోసం ఇళ్లు కోల్పోయిన బాధితులకు అన్యాయం చేశారంటూ మండిపడ్డారు. మూడేళ్ల నుండి డీఎస్సీ నోటిఫికేషన్‌ లేక నాలుగు వేల పాఠశాలలు మూతపడ్డాయన్న ఆయన.. ప్రైవేట్ ఉపాధ్యాయుల ఆత్మహత్యలకు కారణం సీఎం కేసీఆరేనని ఆరోపించారు. చూడాలి మరి ఏం జరుగుతుంది అనేది.

Related posts