*రాజభవన్ ముట్టడిలో రెచ్చపోయిన రేణుకా చౌదరి
*మహిళా పోలీసులో దురుసు ప్రవర్తన..
*పంజాగుట్ట ఎస్పై కాలర్ పట్టుకున్న రేణుకాచౌదరి
*స్టేషన్‌కి వచ్చి కొడతానని పోలీసులకు వార్నింగ్
రాహుల్ గాంధీపై ఈడీ కక్ష సాధింపులకు పాల్పడుతోందంటూ కాంగ్రెస్ పిలుపునిచ్చిన చలో రాజ్‌భవన్ ఉద్రిక్తతంగా మారింది.
కార్యకర్తలతో కలిసి రాజ్‌భవన్ వైపు దూసుకెళ్తున్న కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి పోలీసులు అడ్డుకున్నారు.. తనను టచ్ చేయవద్దని రేణుకా చౌదరిరెచ్చిపోయారు. అక్కడికి వచ్చిన మహిళ పోలీసులతో కూడా రేణుకా చౌదరి వాగ్వావాదానికి దిగింది.
తనను పట్టుకునేందుకు ప్రయత్నించిన మహిళా పోలీస్ అధికారిని ఒక్క సారిగా తోసేని కొట్టేశారు. ఈ క్రమంలో పంజాగుట్ట ఎస్ఐ చొక్కాను పట్టుకొని రేణుకా చౌదరి నిలదీశారు.
అయినప్పటికీ పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని పోలీస్ వాహనం ఎక్కించారు. వాహనం వద్ద కూడా రేణుకా చౌదరి మహిళా పోలీసులతో రేణుకా చౌదరి వాగ్వాదానికి దిగారు. అతి కష్టం మీద రేణుకా చౌదరిని పోలీసులు .. స్టేషన్‌కు తరలించారు.
ఈఎస్ఐ మందుల స్కామ్‌లో అధికారపార్టీ నేతలు: లక్ష్మణ్