కొత్త పౌరసత్వ చట్ట ప్రకంపనలు ఈశాన్య రాష్ట్రాలతో పాటు పలు ప్రాంతాలకు వ్యాపించడంతో కేంద్రం చర్యపై కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ మండిపడ్డారు. నిరసనకు దిగిన విద్యార్థులపై బలప్రయోగం చేయడం చూస్తే మోదీ ప్రభుత్వ పతనం మొదలైందనే విషయం తేటతెల్లమవుతోందని సోనియా ఓ ప్రకటనలో పేర్కొన్నారు. కొలిమిలో యువత భవిష్యత్తును నెట్టి మలమలా మాడ్చేస్తోందని ఘాటు విమర్శలు చేశారు.
పాలకులే హింసకు పాల్పడుతుంటే, రాజ్యాంగ విలువలపై దాడులకు పాల్పడుతుంటే, యువకులను చితకబాదుతుంటే ఈ దేశం ముందుకు నడిచేదెలా? అని ఆమె ప్రశ్నించారు. దేశంలో అస్థిరత్వాన్ని వ్యాప్తి చేసి, హింసకు కారణమవుతూ, యువత హక్కులను ఊడలాక్కుంటూ, మతపరమైన హిస్టీరియాను మోదీ సర్కార్ సృష్టిస్తోందని అన్నారు.
బీజేపీ , కాంగ్రెస్ దొందూ దొందే: హరీష్ రావు