telugu navyamedia
రాజకీయ

హాస్పిటల్ నుంచి సోనియా గాంధీ డిశ్చార్జ్..

కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఈ రోజు సాయంత్రం ఆమె ఢిల్లీలోని గంగా రామ్ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయినట్టు పార్టీ సీనియర్ నేత జైరాం రమేశ్ వెల్లడించారు. ఇంటి వద్దే రెస్ట్ తీసుకోవాలని ఆమెకు వైద్యులు సూచించినట్టు ట్వీట్ చేశారు.

75 ఏళ్ల సోనియాగాంధీ జూన్ 2న కోవిడ్ పాజిటివ్ బారిన పడ్డారు. ఆ తర్వాత కోలుకున్నప్పటికీ కోవిడ్ అనంతర సమస్యలతో జూన్ 12న ఆసుపత్రిలో చేరారు. ఆమె ఆరోగ్యం సుస్థిరంగా ఉన్నదని ఇటీవలే ఓ ప్రకటన వెలువడిన సంగతి తెలిసిందే.

 

Related posts