telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ

ఈటలను పరామర్శించిన రాజాసింగ్‌, రాఘనందర్‌

బీజేపీ నేత ఈటల రాజేందర్ హుజురాబాద్‌ నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్న సమయంలో అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే. వైద్యుల సూచన మేరకు హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రిలో చేరారు. పాదయాత్ర ప్రస్తుతానికి వాయిదా వేస్తున్నట్టు ఈటల ప్రకటించారు. మరోవైపు.. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఈటలను ఇప్పటికే పలువురు నేతలు పరామర్శించారు. ఈరోజు బీజేపీ ఎమ్మెల్యేలు రాజాసింగ్‌, రాఘునందర్‌రావు ఈటలను పరామర్శించారు.. ఆయన ఆరోగ్యపరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.

ఇక, ఆస్పత్రిలో ఈటలను పరామర్శించిన తర్వాత మీడియాకు ఓ వీడియో విడుదల చేశారు ఎమ్మెల్యే రాజాసింగ్‌. ఈటల ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందన్న ఆయన… ఆస్పత్రి నుంచి రేపు ఈటల డిశ్చార్జ్‌ అవుతారని తెలిపారు. త్వరలోనే పూర్తిస్థాయిలో కోలుకొని తిరిగి ఈటల తన పాదయాత్రను ప్రారంభిస్తారని వెల్లడించారు రాజాసింగ్. అంతేకాదు.. ప్రజల ఆశీర్వాదంతో హుజురాబాద్‌ ఉప ఎన్నికల్లో మళ్లీ ఈటల రాజేందర్‌ గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు.

Related posts